మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తప్పనిసరి.. అసలు కారణాలు ఇవే..

ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని డిసైడ్ అయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలు అయితే ఈ ఉగాది పండుగ నాడే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ప్రచారం చేస్తున్నాయి.;

Update: 2026-03-15 18:30 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని డిసైడ్ అయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని మీడియా సంస్థలు అయితే ఈ ఉగాది పండుగ నాడే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ప్రచారం చేస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ నాటికి రెండేళ్లు పూర్తవుతుంది. ఈ 22 నెలల పాలనపై సమీక్షించుకుని వచ్చే ఎన్నికలకు సిద్దమవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో కొందరి పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారని, అదే సమయంలో గత ఎన్నికల్లో మంచిపనితీరు చూపి గెలిచిన శాసనసభ్యులకు మంత్రులుగా ప్రమోషన్ ఇవ్వాలని భావిస్తున్నారని అంటున్నారు.

ప్రస్తుత కేబినెట్ లో ఎక్కువ మంది కొత్త వారు ఉన్నారు. తొలిసారి గెలిచిన వారు, తొలిసారి మంత్రులైన వారు ఎక్కువ. అదే సమయంలో కొందరు శాసనసభ్యులు వరుసగా నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినా మంత్రిగా ఇప్పటివరకు అవకాశం దక్కించుకోలేకపోయారు. ప్రస్తుత కేబినెట్లో కొత్తవారికి అవకాశం ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో పార్టీని పటిష్టం చేయాలని చంద్రబాబు ఆశించినట్లు చెబుతున్నారు. అయితే కొందరు మంత్రులు ఆయా జిల్లాలపై పట్టు సాధించడంలో అనుకున్నంతగా సక్సెస్ కాలేదని అంటున్నారు. శాసనసభ్యులకు మార్గదర్శకంగా నిలవాల్సిన మంత్రులు వారిని సమర్థంగా నడపకలేకపోతున్నారని చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్న మంత్రులతో ఎన్నికలకు వెళ్లడం కష్టమన్న భావనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సీనియర్లు అంటే అనుభవం ఉన్న నేతలను కేబినెట్లోకి తీసుకోవాలని భావిస్తున్నారని చెబుతున్నారు. నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి మంత్రులుగా ప్రమోషన్ ఇచ్చి జిల్లా బాధ్యతలను కూడా అప్పగించాలని చూస్తున్నారని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేల పనితీరులో కూడా మార్పు వస్తుందని చంద్రబాబు ఆలోచనగా ఉందని అంటున్నారు.

ప్రస్తుతం దాదాపు 48 మంది ఎమ్మెల్యేలు పెద్దగా పనిచేయడం లేదని సీఎం దృష్టిలో ఉంది. వీరిలో 25 మంది కాస్త చెబితే తీరు మార్చుకునే అవకాశాలు ఉన్నాయని, మిగిలిన 15 మందిలో నలుగురు లేదా ఐదుగురిని వదులుకోవడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని అంటున్నారు. అంటే దాదాపు 35 మంది ఎమ్మెల్యేలను మార్చాలంటే కేబినెట్ లో నలుగురు లేదా ఐదుగురు మంత్రులను మార్చాలని చంద్రబాబు భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో కొన్ని కీలక జిల్లాల నుంచి అనుభవజ్ఙులైన నేతల పేర్లపై సమచారం తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు. ఉగాది ముహూర్తం తప్పితే శ్రీరామ నవమి తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని అంటున్నారు.

Tags:    

Similar News