బెంగాల్ లో అపుడు ఎనిమిది...ఇపుడు రెండు

మిగిలిన తమిళనాడు అస్సాం, కేరళం లలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు ఇక కేంద్ర పాలిత ప్రాంతంలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఫలితాలు మే 4న విడుదల చేస్తారు.;

Update: 2026-03-15 19:30 GMT

కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ ని తాజాగా రిలీజ్ చేసింది దీని ప్రకారం చూస్తే అతి పెద్ద రాష్ట్రం అయిన పశ్చిమ బెంగాల్ లో రెండు విడతలలో ఎన్నికలు జరగనున్నాయి. మిగిలిన తమిళనాడు అస్సాం, కేరళం లలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తారు ఇక కేంద్ర పాలిత ప్రాంతంలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఫలితాలు మే 4న విడుదల చేస్తారు.

ఎనిమిది విడతలుగా :

అయితే 2021లో చూస్తే పశ్చిమ బెంగాల్ లో ఉన్న మొత్తం 294 అసెంబ్లీ సీట్లకు ఎనిమిది విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. అంటే సగటున 35 అసెంబ్లీ సీట్లకు ఒక విడతన అన్న మాట. సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అని నాడు ఎన్నికలు ఇన్ని విడతలుగా నిర్వహించారు. దీని మీద నాడు అధికార తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఎక్కువ విడతలుగా ఎన్నికలు నిర్వహించడమేమిటి అని కూడా ప్రశ్నించారు. అయితే ఎన్నికలు సజావుగా సాగడానికి అని దానికి జవాబు వచ్చింది.

అప్పట్లో అలా :

ఇక ఆనాడు కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి 2021 ఫిబ్రవరి 26న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దాని ప్రకారం 2021 మార్చి 27 నుండి 2021 ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఓట్ల లెక్కింపు 2021 మే 2న జరిగింది. ఒక విధంగా చెప్పాలీ అంటే టగ్ ఆఫ్ వార్ గా ఆనాడు ఎన్నికలు జరిగాయి. దాదాపుగా బీజేపీ అధికారంలోకి వస్తుంది అన్నట్లుగా ఆనాడు ఎన్నికల వాతావరణం ఉండేది అని కూడా చెబుతారు.

నాలుగవ సారి కోసం :

ఇక ఇపుడు చూస్తే నాలుగవ సారి అధికారం కోసం మమతా బెనర్జీ సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు. ఇక గత ఎన్నికల నాటికి కేవలం మూడు సీట్లు మాత్రమే అసెంబ్లీలో ఉన్న బీజేపీ తన బలాన్ని 78 దాకా పెంచుకుంది. ఈసారి అధికారం అందుకోవాలి అంటే అంతకు రెట్టింపు సీట్లు సంపాదించాలి. మరి తాము కచ్చితంగా గెలిచి తీరుతామని బీజేపీ అంటోంది. రెండు విడతలుగా ఏప్రిల్ 23, 29లలో ఈ ఎన్నికలు బెంగాల్ లో ఎవరు అధికారంలో ఉండాలో నిర్ణయిస్తాయి.

భీకర పోరు ఖాయం :

మమతా బెనర్జీని మాజీ సీఎం ని చేయడానికి పట్టుదలగా బీజేపీ ప్రయత్నం చేస్తోంది. అయితే 215 దాకా బలం ఉండి ఫోర్త్ టైం పవర్ కోసం బరిలోకి దిగుతున్న తృణమూల్ కాంగ్రెస్ వ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు విలక్షణంగా ఉంటాయి. దాంతో ఎవరికీ ఎవరూ తీసిపోరని చెబుతారు. దాంతో ఈసారి కూడా పశ్చిమ బెంగాల్ పోరు ఆసక్తికరమే అని అంటున్నారు.

Tags:    

Similar News