'బాయిబాట'.. మనసులో 'మాట' బయట పెట్టేసిన కవిత!
'బాయిబాట' పేరుతో సింగరేణి బొగ్గుగని కార్మికులను కలుసుకునేందుకు తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
'బాయిబాట' పేరుతో సింగరేణి బొగ్గుగని కార్మికులను కలుసుకునేందుకు తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా ఐదు నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన ఈ సింగరేణి ప్రాంతంలో ఆమె కార్మికులను కలుస్తున్నారు. అయితే.. అంత హఠాత్తుగా ఆమె కలుస్తుండడం.. కార్మికలు కష్టాలు తెలుసుకోవడం వెనుక అనేక చర్చలు జరుగుతున్నాయి.
అయితే.. ఇప్పటి వరకు కవిత తన మనసులో మాటను బయట పెట్టలేదు. కానీ.. తాజాగా.. ఆమె తన మనసులో మాటను బయట పెట్టారు. త్వరలోనే సింగరేణి కార్మికుల సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయం కోసమే కవిత ఇక్కడకు వచ్చినట్టు స్పష్టంగా కనిపించింది. అంటే.. ఇతర పార్టీల కంటే కూడా.. ఆమె దూకుడుగా వ్యవహరించారన్న మాట. ఈ సందర్భంగా ఆమె.. హెచ్ ఎం ఎస్(హింద్ మజ్దూర్ సభ)కు మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో హెచ్ ఎం ఎస్‌ను గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు.
సో.. ఇదన్నమాట కవిత టూర్ వెనుక అసలు విషయం అంటున్నారు పరిశీలకులు. గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆమె సింగరేణి కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. రెండు ఎన్నికల్లో నూ ఈ సంఘాన్ని గెలిపించుకునేందుకు ప్రయత్నించారు. అయితే.. బీఆర్ఎస్‌తో చెడిన తర్వాత.. ఆమె సొంత పార్టీ టీఆర్ఎస్ పెట్టుకున్నారు. కానీ.. ఈ పార్టీకి ఇంకాపూర్తిస్థాయిలో గుర్తింపు రాని నేపథ్యంలో.. హెచ్ ఎం.ఎస్ సంఘానికి మద్దతు తెలిపారు.
ఇక, ఈ పర్యటనలో అటు సింగరేణి అధికారులను, ఇటు రేవంత్ రెడ్డి సర్కారును మరోవైపు.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును కవిత తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కార్మికులు తనతో కలిసిమాట్లాడేందుకు కూడా అధికారులు అనుమతించడం లేదని.. వారి జీతాలు కట్ చేస్తామని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక, తన బాయిబాట కార్యక్రమంపై విమర్శ లు చేసిన శ్రీధర్‌బాబును నియోజకవర్గంలో ఉరికించి ఉరికించి.. ఓడిస్తామని వ్యాఖ్యానించారు. మరోవైపు.. సింగరేణికి 50 వేల కోట్ల రూపాయల మేరకు బకాయి పెట్టిన ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్‌కు సవాల్ రువ్వారు.