ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు

Update: 2021-08-20 08:30 GMT
కరోనా వైరస్ మహమ్మారి కట్టడిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలవుతున్న నైట్ కర్ఫ్యూను మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. సెప్టెంబర్ 4వ తేదీ వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటుందని వెల్లడించింది.

రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటుందని , కరోనా వైరస్ మహమ్మారి ప్రోటోకాల్స్‌ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం వెల్లడించింది.ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌. కర్ఫ్యూ పొడగించిన నేపథ్యంలో ప్రజలందరూ సహకరించాలని తెలిపింది. ఎవరైనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది సర్కార్‌. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని పేర్కొంది. కాగా.. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1501 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,95,708 కి పెరిగింది.ఒక్క రోజు వ్యవధిలో మరో 10 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,696 కి చేరింది.




Tags:    

Similar News