ఇంటర్మీడియట్ రగడ.. హెచ్ ఆర్సీ రంగంలోకి దిగింది
తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘ఇంటర్మీడియట్’ గొడవపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ఎవరూ ఫిర్యాదు చేయకముందే.. మీడియాలో వచ్చిన వార్తల్ని సుమోటాగా తీసుకుని ఈ వివాదం సంగతేంటో తేల్చాలని ఎన్హెచ్ ఆర్సీ భావించింది. వెంటనే తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గత విద్యా సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల మంది దాకా ఇంటర్మీడియట్ పరీక్షలు రాయగా.. అందులో ఏకంగా 3 లక్షల మంది ఫెయిలయ్యారు. ఇంత ఎక్కువ స్థాయిలో విద్యార్థులు ఫెయిలవడం అరుదు. అంతమందికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన చరిత్రే లేదు.
ఫస్ట్ ఇయర్ సెంట్ పర్సంట్ మార్కులు తెచ్చుకున్న విద్యార్థుల్ని ఈ ఏడాది పలు సబ్జెక్టుల్లో ఫెయిల్ చేయడం, సున్నాలు, ఒకటి రెండు మార్కులు వేయడం తీవ్ర ఆందోళన రేపింది. ఇలాంటి గందరగోళం, అవ్యవస్థ గతంలో ఎన్నడూ చూసింది లేదు. మనస్తాపానికి గురైన విద్యార్థుల్లో 18 మంది దాకా ఆత్మహత్యకు పాల్పడటం ఘోరమైన విషయం. ప్రభుత్వం ఈ వ్యవహారంపై చాలా ఆలస్యంగా మేల్కొంది. అయినప్పటికీ ఇప్పటిదాకా బాధ్యులపై ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలేమీ కనిపించడం లేదు. గతంలో ప్రభుత్వ సంస్థే ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనం జరిపేది. కానీ ఈసారి గ్లోబరీనా అనే ప్రైవేటు సంస్థకు అర్హత లేకున్నా ఈ కాంట్రాక్టు కట్టబెట్టారు.
ఈ డీల్‌లో మంత్రి కేటీఆర్ పాత్ర ఉన్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆల్రెడీ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు మానవ హక్కుల సంఘం కూడా రంగంలోకి దిగింది. ఈ అవకతవకలకు కారణాలేంటో, బాధ్యులపై ఎలాంటి చర్యలు చేపట్టారో నాలుగు వారాల్లోపు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని హెచ్ఆర్సీ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.