రాజకీయ ద్రోణుడికి దండం తో సరి,,, జగన్ చల్లని చూపు పడదా...?
ఉత్తరాంధ్రా అంటే ఎంతో మంది రాజకీయ నేతలు కళ్ళ ముందు కదలాడతారు. సర్దార్ గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాధం, భాట్టం శ్రీరామమూర్తి, పీవీజీ రాజు ఇలా ఎన్నో పేర్లు మెదడులో జ్ఞప్తికి వస్తాయి. వారికి సమకాలీనుడు అయిన దివంగత నేత ద్రోణం రాజు సత్యనారాయణ ఉత్తరాంధ్రాను ఒక ఊపు ఊపేశారు. ఆయన్ని రాజకీయ విశ్వవిద్యాలయం అని అంటారు. ఎంతో మంది శిష్యులను తయారు చేసి పదవులు పంచి వారిని మంత్రులను ఎంపీలను చేశారు.
ద్రోణం రాజు పార్లమెంట్ ఉభయ సభల్లో ఎంపీగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యేగా రెండు సార్లు చేశారు. జెడ్పీ చైర్మన్ నుంచి ఉడా చైర్మన్ నుంచి ఎదిగి జాతీయ రాజకీయాల్లో సత్తా చాటారు. ఆయనకు మంత్రి కావాలన్న ఆశ ఉండేది. కానీ తనకు అత్యంత సన్నిహితుడు అయిన పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నా సామాజిక సమీకరణలు కుదరక కేంద్ర మంత్రి కాలేకపోయారు.
ఇక ఉమ్మడి ఏపీలో కూడా తాను ఎంతో ఇష్టపడే వైఎస్సార్ సీఎం గా అయ్యారు. ద్రోణం రాజు ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర మంత్రి అవడం ఖాయమని అనుకున్నారు. కానీ మళ్ళీ సామాజిక సమీకరణలు అడ్డువచ్చి కాలేకపోయారు. ఇక ఎమ్మెల్యేగానే అర్ధాంతరంగా కన్నుమూశారు. ఆయన మూడు తరాల రాజకీయ నాయకులను తయారు చేశారు.
ఆయన కుమారుడు ద్రోణం రాజు శ్రీనివాసరావు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. తండ్రిలాగానే ఉడా చైర్మన్ అయ్యారు. రెండేళ్ళ క్రితం కరోనా బారిన పడి ఆయన అసువులు బాసారు. ఇక మూడవతరంలో మనవడు ద్రోణం రాజు శ్రీవాత్సవ వైసీపీలో యువ నేతగా కొనసాగుతున్నారు. తన తాత తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని ఆయన చూస్తున్నారు.
ఈ రోజు ఆయన తొంబై జయంతి. ద్రోణం రాజు జయంతి వేళ వైసీపీకి చెందిన నాయకులు అంతా వచ్చి పెద్దాయను తలచుకున్నారు. ఒక దండం పెట్టి మమ అనిపించారు. కానీ శ్రీ వాత్సవ విషయంలో మాత్రం ఎవరూ చొరవ తీసుకోవడంలేదని అంటున్నారు. ఇప్పటికి అనేకసార్లు తాడేపల్లి వెళ్ళి ముఖ్యమంత్రి జగన్ని కలసి తన రాజకీయ దోవ ఏంటో చూపమని శ్రీవాత్సవ అభ్యర్ధిస్తూ వస్తున్నారు. జగన్ అయితే అడిగిందే తడవుగా అపాయింట్మెంట్ ఇస్తున్నారు.
కానీ శ్రీవాత్సవకు మాత్రం రాజకీయ భవిష్యత్తు మీద భరోసా ఇవ్వలేకపోతున్నారు. విశాఖ నిండా ద్రోణం రాజు సత్యనారాయణ అభిమానులు ఉన్నారు. ఉత్తరాంధ్రాలో ఆయన శిష్యులు ఉన్నారు. అంతా ఇపుడు తలో పార్టీలో ఉన్నారు. ఎవరికి వారు ఉన్నారు. వైసీపీలో చూస్తే చాలా మంది నాయకులు విశాఖలో ఉన్నారు. వైసీపీ బీసీ నినాదం శ్రీవాత్సవకు రాజకీయ హామీ ఇవ్వలేకపోతోంది. విశాఖ సౌత్ నుంచి తన తండ్రి 2019లో వైసీపీ తరఫున పోటీ చేశారు. ఆ సీటుని శ్రీవాత్సవ కోరుకుంటున్నారు.
కానీ ఆ సీటుని సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి కన్ ఫర్మ్ వైసీపీ చేసింది అని అంటున్నారు. ఆయన రెండు సార్లు గెలిచారు. బీసీ నేత. అర్ధబలం, అంగబలం ఉన్న నాయకుడు. దాంతో ఆయన వైపే పార్టీ మొగ్గు ఉంది. విశాఖ సౌత్ లో తాతా తండ్రి ఇద్దరు గెలిచారు కాబట్టి అదే తన రాజకీయ క్షేత్రం అని శ్రీవాత్సవ అంటున్నారు. అక్కడ బ్రాహ్మణ సామాజికవర్గం అధికంగా ఉంది. దాంతో దాని మీదనే మనవడి కన్ను ఉంది.
అయితే వచ్చే ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయని అంటున్నారు. కోట్లలో వ్యవహారం అంగబలం, అర్ధబలం ఉండాలని అంటున్నారు. పైగా యువకుడు పెద్దగా రాజకీయ అనుభవంలేని శ్రీవాత్సవకు టికెట్ ఇచ్చి రాజకీయ జూదం ఆడేందుకు వైసీపీ పెద్దలు రెడీగా లేరని అంటున్నారు. సరే ఆయనకు ఒక నామినేటెడ్ పదవి అయినా ఇవ్వవచ్చు కదా అన్నది కూడా ద్రోణం రాజు అభిమానుల నుంచి వస్తోంది. ఎంతోమందికి నామినేటెడ్ పదవులను పంచిన జగన్ కి ఇది ఏమంత కష్టం కాదని అంటున్నారు.
దాంతో రాజకీయంగా శ్రీవాత్సవ నిలదొక్కుంటారని, ఏదోనాటికి ఎమ్మెల్యే అవుతారు అని అంటున్నారు. అయితే ఆ విషయంలో కూడా జగన్ చల్లని చూపు పెద్దాయన మనవడి మీద పడడంలేదనే అంటున్నారు. ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేశారు. కార్పోరేషన్ పదవులు పంచేశారు. ఇపుడు చూద్దాం చేద్దామని అంటున్నారు. దాంతో ఉత్తరాంధ్రా రాజకీయ గురువు ద్రోణం రాజు కుటుంబం పట్ల వైసీపీ చిన్న చూపు చూస్తోందా అన్న చర్చ వస్తోంది.
పెద్దాయన అంటేనే ఉత్తరాంధ్రా. ఆయన అంటేనే విశాఖ. ఆయన గతించి ఏళ్ళు గడుస్తున్నా ఆయన అభిమాన గణం అలాగే ఉందని, వారిని అక్కున చేర్చుకోవడానికైనా శ్రీవాత్సవకు రాజకీయ దోవ చూపిస్తే బాగుంటుంది అని అంటున్నారు. అలా కాకుండా జయంతులకు వర్ధంతులకు ఒక దండం పెట్టేసి మమ అనిపించేస్తే సరిపోతుందా అన్న చర్చ అయితే వస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.