18 నెలలుగా తప్పించుకుని తిరుగుతున్నాడు.. ఎలా చంపారంటే..!

అయితే.. సుమారు గత వారం రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్ లో భద్రతాదళాలు ఆదిల్ ను హతమార్చాయి. ఇది జేఎం కి పెద్ద దెబ్బే అని అంటున్నారు.;

Update: 2026-02-05 09:59 GMT

జమ్మూకశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో జైష్-ఎ-మొహమ్మద్ (జేఎం) ఉగ్రవాదిని భద్రతా దళాలు హతమార్చడం ద్వారా పాకిస్థాన్ మద్దతుగల ఉగ్రవాదానికి పెద్ద దెబ్బ తగిలింది. ఇందులో భాగంగా... పాకిస్థాన్ జాతీయుడు, సీనియర్ లష్కరే కమాండర్ సైఫుల్లాకు గుడిభుజం అయిన ఆదిల్ సుమారు గత 18 నెలలుగా తప్పించుకుంటూనే ఉన్నాడు. అయితే.. సుమారు గత వారం రోజులుగా కొనసాగుతున్న ఆపరేషన్ లో భద్రతాదళాలు ఆదిల్ ను హతమార్చాయి. ఇది జేఎం కి పెద్ద దెబ్బే అని అంటున్నారు.

అవును... ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా సుమారు వారం రోజులుగా నిర్వహిస్తున్న ఆపరేషన్ లో బుధవారం సాయంత్రం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. పక్కా సమాచారం ఆధారంగా భద్రతా దళాలు ఛత్రూ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ సమయంలో దళాలపై ఆదిల్ ను చుట్టుముట్టి కాల్చి చంపాయి. ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... సుమారు 20 సార్లు అతడు పట్టుబడకుండా తప్పించుకుంటున్నాడని.. ఈసారి మాత్రం ఆదిల్ పప్పులు ఉడకలేదని.. అతడు మరణించాడని తెలిపారు1

ఇదే సమయంలో.. మరో జైషే ఉగ్రవాది ఆదిల్ సహచరుడు సైఫుల్లాను పట్టుకోవడానికి భద్రతా దళాలు తమ ఆపరేషన్ ను ముమ్మరం చేశాయి. పాకిస్థాన్ జాతీయుడైన జైషే కమాండర్ సైఫుల్లా.. సుమారు రెండు సంవత్సరాల క్రితం సరిహద్దుల్లోకి చొరబడినట్లు చెబుతున్నారు. అప్పటి నుంచి కిష్త్వార్, దోడా ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. భద్రతా దళాలపై అనేక దాడుల్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఇతడి కోసం భద్రతా దళాలు గాలింపు ముమ్మరం చేశాయని తెలుస్తోంది.

ఆదిల్ హత్య తర్వాత సైఫుల్లా ఛత్రో ఉత్తరం వైపు పారిపోయాడని భద్రతా దళాలకు పక్కా సమాచారం అందిందని తెలుస్తోంది. కిష్త్వార్ లో చాలా కాలంగా చురుగ్గా ఉన్న సైఫుల్లాను పట్టుకోవడానికి భద్రతా దళాలు మూడు ఆపరేషన్లు ప్రారంభించాయి! ఈ సమయంలో.. దట్టమైన అడవులు, కఠినమైన భూభాగంలో మిగిలి ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భద్రతా దళాలు డ్రోన్లను ఉపయోగిస్తూ సెర్చ్ చేస్తున్నాయి.

ఈ సందర్భంగా స్పందించిన సీనియర్ భద్రతా దళ అధికారి ఒకరు... చివరి ఉగ్రవాది మన పర్వతాల నుంచి బయటకు వచ్చే వరకూ తాము పోరాడుతూనే ఉంటామని తెలిపారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోన్న కిష్త్వార్ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉండగా.. ఆ ప్రాంతంలోనే ఉగ్రవాదులు దాక్కుని ఉంటారని చెబుతున్నారు. దీంతో డ్రోన్ లతో పాటు స్నిఫర్ డాగ్ లను ఉపయోగించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Tags:    

Similar News