• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఈటలపై ప్రేమతో కేసీఆర్...

ఈటలపై ప్రేమతో కేసీఆర్ చేసిన పనికి ఫిదా

By - Tupaki Desk
Update: 2022-03-21 05:30 GMT
పగోడిని కూడా ప్రేమించేంతటి మంచితనం సినిమాల్లోనే చూపిస్తుంటారు. అప్పుడప్పుడూ రాయలసీమలో మారిన మనుషులను ఇందుకు ఉదాహరణగా చూపిస్తుంటారు.కానీ రాజకీయాల్లోనూ అది సాధ్యమేనని కేసీఆర్ చూపించారని ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. తెలంగాణ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ ను బర్తరఫ్ చేసిన సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపడం వైరల్ అయ్యింది.

హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం కేసీఆర్ లేఖ రాయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని లేఖలో పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ లేఖ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఈటలకు గవర్నర్ తమిళిసై కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల బీజేపీలో చేరడం.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ తరుఫున విజయం సాధించడం తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్ఎస్, ఈటల మధ్య మాటల తూటాలు పేలాయి. కేసీఆర్ పై ఈటల తీవ్ర విమర్శలు చేశాడు. ఇంతటి వివాదం తర్వాత తాజాగా సీఎం కేసీఆర్ ఈటలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడం వైరల్ గా మారింది.

ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ తో కలిసి పోరాడారు. కేసీఆర్ ఎంపీగా ఢిల్లీలో చక్రం తిప్పితే ఈటల టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా రాష్ట్రంలో పార్టీని ముందుండి నడిపించారు. కేసీఆర్ తర్వాత అంతటి ప్రాధాన్యత దక్కించుకున్న ఈటలను ఇటీవలే కేసీఆర్ బర్త్ రఫ్ చేసి కేబినెట్ నుంచి బయటకు పంపించాడు. అయితే అప్పటి సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నాడో ఏమో కానీ తాజాగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి పాత పగలన్నీ మరిచిపోయాడు.

Tags:    
  • CM 
  • KCR 
  • telangana 
  • trs 
  • ktr 
  • hyderabad 
  • letter 
  • etala rajender 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS