మోడీ సర్కారు తెచ్చిన కొత్త వాహన తక్కు విధానం ఎలా ఉంటుంది? ఏం జరగనుంది?
కాలం చెల్లిన పాత వాహనాలు.. ఫిట్ నెస్ ఏ మాత్రం లేని వాహనాలను గుడ్ బై చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఏళ్లకుఏళ్లు గడిచినా ఫిట్ నెస్ లేని వాహనాల్ని ఉపయోగించేవారెందరో. ఇలాంటి వాహనాల్ని తక్కు కింద మార్చేందుకు వీలుగా తిరిగి ఇచ్చేందుకు వీలుగా ఒక విధానంఅంటూ ఏమీ లేదు. ఇలాంటిపరిస్థితుల్లో.. ఆ కొత్త విధానాన్ని తాజాగా తెర మీదకు తీసుకొచ్చింది కేంద్రం లోని మోడీ ప్రభుత్వం. ఆగస్టు 13 నుంచి కొత్త వాహన తక్కు విధానాన్ని కేంద్రం లాంఛనంగా ప్రారంభించారు. ఒక అంచనా ప్రకారం దేశంలో కోటి వరకు కాలం చెల్లిన.. ఫిట్ నెస్ లేని వాహనాలు ఉన్నాయన్నది అంచనా. వీటి కారణంగా కాలుష్యం పెరిగిపోవటంతోపాటు.. ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అలాంటి వాటిని తక్కుగా మార్చేయటం ద్వారా ప్రయోజనాలెన్నో.
గుజరాత్ లో జరిగిన పెట్టుబడి సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ఈ కొత్త వాహన తుక్కు విధానాన్ని ప్రారంభించారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా తమ వద్ద ఉన్న పాత వాహనాల్ని ప్రభుత్వాలకు ఇచ్చేయటం ద్వారా ప్రయోజనాన్ని పొందే వీలుంది. అదే సమయంలో.. పర్యావరణం మీద పడుతున్న భారం కొంతమేర తగ్గే వీలుందని చెప్పాలి. ఈ కొత్త విధానంలోకి యువత..స్టార్టప్స్ కంపెనీలు భాగస్వామ్యం కావాలని ప్రధాని మోడీ పిలుపునివ్వటం గమనార్హం.
ఈ కొత్త విధానంతో దాదాపుగా రూ.10వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే వీలుందని అంచనా వేస్తున్నారు. రవాణా రంగంలో వస్తోన్న ఆధునిక విధానాలు రవాణా, ప్రయాణ భారాన్ని తగ్గించడంతో పాటు ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయన్న అభిప్రాయాన్ని ప్రధాని మోడీ వెల్లడించారు. ఈ కొత్త పాలసీ కారణంగా మధ్యతరగతి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. వాహన జీవితకాలంతో మాత్రమే కాదు.. ఆటోమేటెడ్ టెస్టింగ్ లోనూ ఫిట్ నెస్ లేవని తెలిసినా వాటిని తుక్కుగా పరిగణిస్తారని చెబుతున్నారు. తక్కువగా మారిన పాత వాహనాలకు ధ్రువపత్రాలు జారీ చేస్తారన్నారు. అంతేకాదు.. కొత్త వాహనాన్ని కొనే వేళలో.. రాయితీ కూడా లభించనుంది. ఈ పాలసీతో దేశ వ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లు.. రిజిస్టర్ వెహికిల్ స్క్రాపింగ్ పెసిలిటీ ఏర్పాటుకు వీలు కానుంది.
ఈ విధానానికి సంబంధించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ఈ తక్కు పాలసీ కారణంగా ముడి సరుకుల ధరలు 40 శాతం మేర తగ్గే వీలుందని.. ఆటో మొబైల్ తయారీలో ఇండియా ఇండస్ట్రీయల్ హబ్ గా మారే అవకాశం ఉందన్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సైతం గత బడ్జెట్ లో కొత్త వాహన తక్కు విధానాన్ని ప్రకటించి.. వాటికి ప్రోత్సాహకాల్ని ప్రకటించటాన్ని మర్చిపోలేం. వాహన తక్కు విధానం కింద పాత వాహనాన్ని ఇచ్చేస్తే.. దానిపై కంపెనీలు ఐదు శాతం రాయితీ ఇవ్వనున్నట్లు కేంద్ర రవాణా శాఖ గతంలోనే ప్రకటించింది.
ఇదిలా ఉంటే..వాహన తక్కు విధానం మొదలైన నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వానికి టాటా మోటార్స్ మధ్య ఎంవోయూ కుదిరింది. గుజరాత్ లో తక్కు విధానాన్ని అమలు చేయటానికి వీలుగా రాష్ట్రంలో 450 - 500 ఫిట్ నెస్ కేంద్రాలతో పాటు అరవై డెబ్బై వరకు వాహన తక్కు కేంద్రాల్నిఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాహన తుక్కు విధానంలోని కీలకాంశాల్నిచూస్తే..
- స్క్రాపింగ్ కేంద్రంలో పాత వాహనాన్ని ఇస్తే సదరు వాహన స్క్రాపింగ్ ధరను యజమాని పొందుతాడు. ఇది కూడా వారు కొనుగోలు చేసే కొత్త వాహనం ఎక్స్-షోరూం ధరలో నాలుగు నుండి ఆరు శాతం వరకు ఉండవచ్చు.
- ఈ స్క్రాపింగ్ విధానం కింద పాత వాహనం ఇస్తే ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ కొత్త వాహనం పైన 5 శాతం డిస్కౌంట్ అందిస్తారు. దీనికి స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉండాలి. పాత వాహనాన్ని ఇచ్చే వేళలోనే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తారు.
- ఈ కొత్త స్క్రాపేజీ పాలసీతో మరో ప్రయోజనం కూడా ఉంది. పర్సనల్ వెహికిల్‌కు రోడ్ ట్యాక్స్ రాయితీ 25 శాతం వరకు ఉంటే, కమర్షియల్ వాహనాలకు 15 శాతం వరకు ఉంది. ఈ పాలసీ ప్రకారం ప్రయివేటు వాహనం 20 ఏళ్ల తర్వాత డీ-రిజిస్టర్ అవుతుంది. అన్-ఫిట్‌గా తేలినా.. కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకున్నా డీ-రిజిస్టర్ అవుతుంది. ప్రయివేటు వాహనాలకు 15 సంవత్సరాల తర్వాత రీ-రిజిస్ట్రేషన్ ఫీజులు వర్తిస్తాయి.
- కమర్షియల్ వాహనాలకు అయితే ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందలేకపోతే పదిహేనేళ్ల తర్వాత డీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉంటే కొత్త వాహనం కొనుగోలు పైన రిజిస్ట్రేషన్ ఫీజును కూడా మినహాయించవచ్చు.
- కమర్షియల్ వెహికిల్స్‌కు ఏప్రిల్ 1, 2023 నుండి ఫిట్ నెస్ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశముంది. పర్సనల్ వెహికిల్స్‌కు మాత్రం జూన్ 1, 2024న ప్రారంభం కానుంది. మినిస్ట్రీ ఆప్ రోడ్ ట్రాన్సుపోర్ట్ అండ్ హైవేస్.. ఈ ఏఢాది ప్రారంభంలో 15 సంవత్సరాల పాత వాహనాల ఆర్ సీ రెన్యువల్ ఫీజు పెంపును ప్రతిపాదిస్తూ ముసాయిదా నోటిఫికేషన్‌ను కూడా జారీ చేయటం గమనార్హం.