గుంటూరు రేప్ కేసు: పోలీస్ బాస్ కొడుకేనా?

Update: 2020-06-29 12:10 GMT
గుంటూరు లో సంచలనం సృష్టించిన విద్యార్థిని పై రేప్ ఘటన లో తవ్విన కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నట్టు సమాచారం. సదురు యువతి ని వరుణ్, ఆకాష్ అనే ఇద్దరు లొంగదీసుకొని ఆమె నగ్న చిత్రాలు పోర్న్ సైట్స్ లో అప్ లోడ్ చేసిన కేసును పోలీసులు విచారిస్తున్నారు.

ఈ కేసులో ప్రధాన సూత్రధారి పోలీస్ డిపార్ట్ మెంట్ లనే పనిచేస్తున్న ఇద్దరు అధికారుల కొడుకుగా పోలీస్ విచారణలో గుర్తించినట్టు ప్రచారం జరుగుతోంది. ముందుగా సదురు యువతిని లొంగదీసుున్నది అతడేనని అనుమానిస్తున్నారు.

అయితే ఇప్పటికే తమ కొడుకుని రక్షించుకునేందుకు ఆ పోలీస్ తల్లిదండ్రులు రంగంలోకి దిగినట్టు సమాచారం. ఆధారాలను లేకుండా చేసినట్టు తెలుస్తోంది.  అంతేకాదు.. తమ కొడుకును రహస్య ప్రదేశానికి తరలించినట్టు ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం యువతి నగ్న వీడియోలు పెట్టిన ‘మై నేమ్ ఈజ్ 420’ అనే యూజర్ ఐడీ కూడా పోలీస్ దంపతుల కొడుకుదేనని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై ఐపీ అడ్రస్, మెయిల్ ఐడీ ట్రేసింగ్ కోసం గూగుల్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్స్ లకు పోలీసులు లేఖ రాశారు.  ఆ వివరాలు వస్తే గానీ  పోలీస్ కొడుకు వ్యవహారంలో నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News