ఐపీఎల్లో కొత్తజట్టు.. డీల్​ కుదుర్చుకున్న సౌత్​ బడా హీరో!

Update: 2020-11-12 03:00 GMT
ఐపీఎల్ 2020 ముగిసింది. మ్యాచ్​ మ్యాచ్​ ​కో మలుపుతో , పాయింట్ల పట్టికలో రోజుకో మార్పుతో ఆసక్తిదాయకంగా సాగింది. అందరూ ఊహించినట్టుగానే ముంబై ఇండియన్స్​ కప్పు ఎగరేసుకుపోయింది. కొత్త జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సారి కప్​ గెలుచుకుంటుందని భావించినా.. ఫైనల్​ మ్యాచ్​లో గట్టిపోటీ కూడా ఇవ్వలేకపోయింది. ముంబై ఇండియన్స్​ అలవోకగా ఫైనల్​లో గెలుపొందింది. ఈ సీజన్​ ముగిసిందో లేదో అప్పుడే  తర్వాత సీజన్​ పై అంచనాలు పెరుగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి లో ఐపీఎల్​ 2021 నిర్వహిస్తామని.. అదికూడా భారత్ ​లోనే ఉంటుందని ఇప్పటికే బీసీసీఐ చీఫ్​ సౌరవ్​గంగూలీ ప్రకటించారు. అయితే వచ్చేఏడాది మరో కొత్తజట్టు ఐపీఎల్​లో చేరనున్నట్టు టాక్​. ఈ ప్రాంచైజీ కోసం ప్రముఖ ఆన్​లైన్​ క్లాసుల సంస్థ బైజుస్ తో కలిసి సౌత్​ ఇండియా స్టార్​హీరో మోహన్​లాల్​ బిడ్ దాఖలు చేసినట్లు టాక్​.

అయితే అహ్మదాబాద్​ లేదా కేరళ రాష్ట్రాల తరఫున ఆడే జట్టుకు మోహన్​లాల్​ ఓనర్​గా వ్యవహరించనున్నాడట. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం రాలేదు.. అనధికారికంగా వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా కారణంగా వచ్చిన నష్టాన్ని పూడ్చేందుకు బీసీసీఐ కొత్త జట్టును తీసుకురానుందని ప్రచారం జరుగుతోంది. కొత్త ఫ్రాంచైజీ రాకతో పూర్తి స్థాయిలో మెగా వేలాన్ని నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్నద్ధం అవుతోందట.

ఈ మేరకు ఇప్పటికే ఫ్రాంచైజీల కు ఓ ఇండికేషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ప్రతీ సీజన్ వేలం డిసెంబర్‌ లోనే జరుగుతుంది, కానీ ఈ సారి మాత్రం వచ్చే ఏడాది ఆరంభంలో పూర్తి స్థాయిలో వేలం జరగనుందని సమాచారం. స్టార్ ఆటగాళ్లు కూడా వేలంలోకి రానున్నట్లు తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ కు మోహన్​ లాల్​ హాజరయ్యారు.  వాస్తవానికి ఈ సీజన్‌ లో ప్రేక్షకులకు అనుమతి లేదు. కానీ మోహన్​ లాల్​  రావడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. మోహన్ లాల్ రావడంతో కొత్త ఫ్రాంచైజీ కోసమే వచ్చారని, బైజుస్‌ తో కలిసి కొత్త ఫ్రాంచైజీ కోసం బిడ్ కూడా దాఖలు చేశారని ఓ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు.
Tags:    

Similar News