కర్ణాటకలో కొత్త రచ్చ.. అబ్బాయిల్నిరేప్ చేస్తున్నారట

Update: 2021-10-19 03:49 GMT
అర్థరాత్రి ఒంటరిగా ఒక అమ్మాయి నిర్భయంగా బయటకు వెళ్లి.. క్షేమంగా ఇంటికి తిరిగి వస్తేనే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చినట్లుగా జాతిపిత గాంధీజీ చెప్పటం తర్వాత.. పట్టపగలే దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్న ఉదంతాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా కర్ణాటకలో మగాళ్ల మీద అత్యాచారాలు జరుగుతున్న వైనాలు ఎక్కువ అవుతున్నాయి. కామాంధులు అమ్మాయిల్ని మాత్రమే కాదు.. అబ్బాయిల్ని కూడా వదలటం లేదన్న అనుమానం కలిగేలా పరిణామాలు ఉండటం గమనార్హం. తాజాగా ఈ తరహా ఉదంతాలు రెండు చోటు చేసుకోవటం ఆందోళనకు గురి చేస్తోంది. అమ్మాయిలే కాదు.. అబ్బాయిలకు రక్షణ కరువైందా? అన్న సందేహం కలిగేలా పరిణామాలు ఉన్నాయి.

కర్ణాటకలోని పుత్తూరు జిల్లాకు చెందిన ఇరవై ఏళ్ల యువకుడు ఒకరు సాయంత్రం వేళ సరదాగా వాకింగ్ కు బయలుదేరాడు. స్థానిక రైల్వే ట్రాక్ వద్ద తమ గ్రామానికి చెందిన హనీఫ్ అనే వ్యక్తి కనిపించాడు. చెరుకు సరం తాగుదామని చెప్పటంతో అతనితో పాటు వెళ్లాడు. సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి సదరు కుర్రాడిపై అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయపడుతూ ఇంటికి చేరిన కొడుకు తీరు తేడాగా ఉండటంతో అనుమానం వచ్చిన తండ్రి ఏం జరిగిందని ప్రశ్నించటంతో అసలు విషయాన్ని చెప్పాడు. దీంతో.. పోలీసుల్ని ఆశ్రయించారు.

ఇదిలా ఉంటే కర్ణాటకలోని బెల్గాం జిల్లాకు చెందిన 24 ఏళ్ల కుర్రాడిపైనా అత్యాచారం జరగటం గమనార్హం. అంతాని పట్టనానికి చెందిన బాధితుడు హోటల్లో పని చేస్తుంటాడు. డ్యూటీ పూర్తి చేసుకొని ఇంటి వెళ్లేందుకు బస్టాప్ దగ్గర నిలుచున్న అతడ్ని అదే గ్రామానికి చెందిన రాజు మాయమాటలు చెప్పి తన బైక్ మీదకు ఎక్కించుకున్నాడు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో.. బాధితుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకాలం అమ్మాయిల మీద అత్యాచారాలు జరిగిన వైనాలకు భిన్నంగా అబ్బాయిల మీద అత్యాచారాలు చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది.




Tags:    

Similar News