ఏపీ గవర్నర్‌గా కిరణ్‌ బేడీ.?

Update: 2019-01-20 11:28 GMT
మొన్నటికి మొన్న మోదీ మాట్లాడుతూ.. ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌ కాదు.. స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇస్తామని ప్రకటించారు. ఆ స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌కు సంబంధించి పనులు ఆల్‌ రెడీ మోదీ అండ్‌ టీమ్‌ మొదలు పెట్టి నట్లే కన్పిస్తోంది.  రీసెంట్‌ గా ఏపీ ఎన్నికల అధికారిగా ద్వివేదిని నియమించింది. ఇప్పుడు రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ని నియమించేందుకు పావులు కదుపుతుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్ట్‌ మెంట్‌ గవర్నర్‌ గా ఉన్న కిరణ్‌ బేడీని ఏపీ గవర్నర్‌ గా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్రం ఏర్పడి నాలుగున్నరేళ్లు గడిచాయి. విభజన జరిగిన దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించాలని అనుకుంటుందట కేంద్రం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పదవీ కాలం చాలా కాలం క్రితమే ముగిసినప్పటికీ, తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఆయనే రెండు రాష్ట్రాలకూ గవర్నర్‌ గా కొనసాగుతారని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పుడు ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టం, మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో, ఏపీకి ప్ర‌త్యేక గ‌వ‌ర్న‌ర్ ఉంటే బావుంటుందనేది కేంద్రం ఆలోచన. ఆ కోణంలోనే ఇప్పటికే ఎన్నికల కమిషనర్‌ ని మార్చారని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు గవర్నర్‌ ని కూడా మార్చి.. చంద్రబాబు కు ఎలా గైనా చెక్‌ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
Tags:    

Similar News