• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గౌతం రెడ్డి సీటు...

గౌతం రెడ్డి సీటు ఎవరికంటే... ?

By - Tupaki Desk
Update: 2022-02-27 00:30 GMT
కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన వైసీపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి వారసుడి విషయంలో ఇపుడు వైసీపీ అధినాయకత్వం  దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. గౌతం రెడ్డి నెల్లూరు జిల్లాలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వారసుడిగా ఎదిగారు. తనకంటూ తిరుగులేని ప్రజాదరణను సొంతం చేసుకున్నారు. 2014, 2019లలో రెండుసార్లు ఆత్మకూరు నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో గెలిచారు. ఇక ఆయన పరిశ్రమల శాఖ మంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకునేలా పనిచేశారు.

చివరిదాకా ఆయన ఏపీకి పెట్టుబడులు తేవాలనే ప్రయత్నం చేశారు. ఒక విధంగా ఆయన ప్రయత్నాలు ఫలించే దశలో ఉండగా కన్నుమూశారు. ఇక మార్చి 2తో గౌతం రెడ్డి దశ దిన కర్మలు పూర్తి అవుతాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికే ఆత్మకూరు స్థానం ఖాలీ అయిన సంగతిని కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వ అధికారులు తెలియచేశారు.

దాంతో ఆరు నెలల వ్యవధిలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. లేదా ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల తరువాత జరిగే ఉప ఎన్నికలతో కలిపి కూడా నిర్వహించవచ్చు. దాంతో ఆత్మకూరులో ఎవరికి టికెట్ ఇవ్వాలీ అన్న అంశం అయితే వైసీపీలో చర్చకు వస్తోంది. ఆత్మకూరులో గౌతం రెడ్డి వారసత్వాన్ని ఆయన భార్య శ్రీకీర్తి రెడ్డికి ఇవ్వాలని వైసీపీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

గౌతం రెడ్డి కుమారుడు క్రిష్ణార్జున రెడ్డి చిన్నవాడు కావడం, తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి వయోభారం రిత్యా పోటీకి సుముఖత వ్యక్తం చేయకపోవచ్చునని తెలుస్తున్న నేపధ్యంలో భార్యకే పోటీకి నిలబెట్టాలని చూస్తున్నారు. దాంతో దశ దిన కర్మ తరువాత కుటుంబ సభ్యులకు ఈ సంగతి తెలియచేసి వారి నుంచి కూడా ఒక క్లారిటీ తెచ్చుకుని ఆమె పేరునే అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు.

మరో వైపు చూస్తే ఆత్మకూరులో వైసీపీ బలంగా ఉంది. పైగా ఇది అనూహ్యంగా వచ్చిన ఉప ఎన్నిక కావడంతో ఈ ఉప ఎన్నికలో విపక్షాలు పోటీకి అభ్యర్ధిని పెట్టవని ఆలోచిస్తున్నారు. సో ఏకగ్రీవం అయ్యే చాన్సులే ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి వైస్ జగన్ మాత్రం శ్రీకీర్తి రెడ్డి పేరునే అనుకుంటున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    
  • Mekapati Gowtham Reddy 
  • YSRCP 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

Copyright @2026

Powered by Blink CMS