• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తనను చాలా ఎక్కువగా...

తనను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడా?

By - Tupaki Desk
Update: 2021-03-27 09:30 GMT
నరసాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామకృష్ణంరాజు తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నట్లుంది. ప్రతి చిన్న విషయానికి జగన్మోహన్ రెడ్డితో పోలికో లేకపోతే జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయందే ఈ తిరుగుబాటు ఎంపికి రోజు గడవటం లేదేమో. తాజాగా ఆయనపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. బ్యాంకుల కన్సార్షియంను మోసం చేసి రూ. 234 కోట్లు దారిమళ్ళించిన కారణంగా ఎస్బీఐ ఉన్నతాధికారి ఇచ్చిన ఫిర్యాదుతో ఎంపి+కుటుంబసభ్యులు+డైరెక్టర్లపైన ఎఫ్ఐఆర్ నమోదైంది.

కేసు నమోదుచేసింది సీబీఐ. ఫిర్యాదుచేసింది ఎస్బీఐ ఉన్నతాధికారి.  ఆరోపణేమో  వందల కోట్లరూపాయలను దారిమళ్ళించటం. ఇది కేవలం ఆరోపణ మాత్రమే కాదు. అంతర్గతంగా విచారణ చేసుకున్న తర్వాతే బ్యాంకుల కన్సార్షియం ఫిర్యాదుచేసింది. వాస్తవం ఇలాగుంటే తనమీద సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయటానికి కారణం జగనే అంటున్నాడు ఈ ఎంపి. తనపై ఎఫ్ఐఆర్ నమోదు వెనుక జగన్ ఒత్తిడే కారణమంటు ఎంపి మండిపోతున్నారు.

అసలు ప్రతిదానికి జగన్ను పిక్చర్లోకి ఎంపి ఎందుకు తీసుకొస్తున్నాడో ఎవరికీ అర్ధం కావటంలేదు. జగన్ చెబితేనో లేకపోతే ఒత్తిడి తీసుకొస్తేనో ఎంపిపైన సీబీఐ కేసు పెట్టేస్తుందా ?  గిట్టని వాళ్ళమీద సీబీఐ పై ఒత్తిడి తెచ్చి కేసులు పెట్టించేంత సీనే జగన్ కుంటే తనపైన సీబీఐ కేసు పెట్టేదేనా అసలు ?  బ్యాంకుల్లో అప్పులు తీసుకుంది ఎంపి, తీసుకున్న అప్పును పక్కదారి పట్టించింది ఎంపి. బ్యాంకులు కేసు పెడితే జగన్ కేమి సంబంధం ?

తనపైన నమోదైన ఎఫ్ఐఆర్ ను తప్పుడుదని చెబుతున్న ఎంపి మరి జగన్ పైన వెంటనే సీబీఐ విచారణ చేయటం లేదని అడగటమే విచిత్రంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే తనను తాను జగన్ సమానస్ధాయి వ్యక్తిగా పోల్చుకుంటున్నట్లున్నారు. అందుకనే ప్రతిరోజు జగన్ను టార్గెట్ చేస్తున్నారు. తనవల్లే నరసాపురంలో వైసీపీ గెలిచిందని చెప్పే ఎంపి మరి పార్టీకి రాజీనామా చేసేసి మళ్ళీ పోటీచేసి గెలవచ్చు కదా. అప్పుడు ఎవరి కెపాసిటి ఏమిటో తెలిసిపోతుంది .
Tags:    
  • MP Raghurama Krishnam Raju 
  • Sensational Comments 
  • Cm Ys Jagan 
  • Ysrcp 
  • Delhi 
  • Telugu News 

Similar News

అమెరికాలో దీపావళి వేడుకలపై ఆంక్షలు.. బాణసంచా కాల్చితే $2,000 ఫైన్!

2026-11-05 04:16 GMT

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

2026-11-05 04:15 GMT

గూగుల్‌లో ఉద్యోగాలపై ఏఐ ప్రభావం.. మారుతున్న టెక్ కంపెనీల ఆలోచనా విధానం!

2026-11-05 04:14 GMT

డిప్యూటీ మేయర్లు...వైఎస్ చైర్మన్ల ఎన్నికకు కౌంట్ డౌన్

2026-11-05 04:10 GMT

అక్కడా 11 శాతం సీట్లే... వైసీపీకి మళ్ళీ ట్రోలింగ్ !

2026-11-05 04:09 GMT

బ్యూరోక్రాట్స్ హిట్ కొట్టలేకపోతున్నారు..రీజన్ అదే ?

2026-11-04 18:30 GMT

కోస్తా గేట్ తాకని వైసీపీ...సేమ్ సీన్ రిపీట్

2026-11-04 18:03 GMT

విశాఖ డిప్యూటీ మేయర్ మీద బీజేపీ కర్చీఫ్ ?

2026-11-04 18:01 GMT

ఎన్టీఆర్ ఆత్మ గౌరవ నినాదం...కేటీఆర్ కామెంట్స్ వెనక ?

2026-11-04 18:01 GMT

బ్యాలెట్ పేపర్లే.. కానీ కౌంటింగ్ మాత్రం రాకెట్ స్పీడ్.. అమెరికా ఎన్నికల్లో అసలు టెక్నాలజీ ఇదే..

2026-11-04 18:00 GMT

భారత్, చైనా సహా ఈ నాలుగు దేశాలకు హార్మూజ్ ను ఓపెన్ చేసిన ఇరాన్.. కానీ ట్విస్ట్

2026-11-04 17:52 GMT

పవన్ ఇలాకాలో ఏంటీ తేడా...బిగ్ నంబర్ తోనే !

2026-11-04 17:46 GMT

Copyright @2026

Powered by Blink CMS