నెదర్లాండ్ విమాన ల్యాండింగ్ ను తిరస్కరించిన భారత్

Update: 2020-03-22 05:57 GMT
కరోనా వైరస్ భయం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తమ దేశాల్లోకి విదేశీయులు రాకుండా సరిహద్దులు మూసివేస్తున్నారు. విదేశాలకు విమాన రాకపోకలను నిషేధిస్తున్నారు. ఇప్పుడు భారత్ కూడా అదే బాట పట్టింది. ఇతర దేశాల నుంచి విమానాల రాకపోకలను భారత్ నిషేధించింది. కరోనా వైరస్ ఇతర దేశాల నుంచే భారత్ కు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

తాజాగా 90మందికి పైగా భారతీయ ప్రయాణికులతో వచ్చిన నెదర్లాండ్ విమానానికి భారత్ ల్యాండింగ్ కు అనుమతించలేదు. భారత డిజిసిఏ, సివిల్ ఏవియేషన్ ఢిల్లీకి వచ్చిన నెదర్లాండ్ విమానం ల్యాండింగ్ ను అనుమతించలేదు. దీంతో విమానం తిరిగి వెళ్లిపోయింది. నెదర్లాండ్ లోని అమ్ స్టర్ డామ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఈ విమానాన్ని భారత్ తిరస్కరించింది.

ప్రస్తుతం యూరప్ లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇటలీ, స్పెయిన్ లో కరోనా భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. యూరప్ నుంచి అన్ని విమానాలను రద్దు చేసిన భారత్ నెదర్లాండ్ నుంచి వచ్చిన ఈ విమానాన్ని కూడా భారత్ లోకి అనుమతించలేదు.

యూరప్ నుంచి ఈ 90మంది బాధితులు దిగితే దేశంలో కరోనా వ్యాప్తి చెందడం ఖాయం కావడంతో భారత్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. దీంతో నెదర్లాండ్ విమానం తిరిగి వెళ్లిపోయింది.
Tags:    

Similar News