మెల్లిగా దిగొస్తున్న మోడీ
గతేడాది తెచ్చిన మూడు సాగునీటి చట్టాలపై వెనక్కుతగ్గేది లేదని నిన్నమొన్నటి దాక భీష్మించిన కేంద్రం లోని ఎన్డీఏ ప్రభుత్వం హఠాత్తుగా వెనక్కుతగ్గింది. రైతులు ఏడాది పాటు ఢిల్లీ శివారులో బైఠాయించినా.. ఏమాత్రం వెనక్కుతగ్గని సర్కారులో ఇంత మార్పేమిటా? అని అందరూ ఆశ్చర్యపోయేంతగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి ఎన్డీ ఏ భాగస్వామ్య పక్షాలతో పాటు ప్రతిపక్షాలూ అవాక్కయ్యాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఎంతకూ తగ్గని ప్రధాని మోదీలో ఇంత మార్పేమిటా? అని ఆలోచనలో పడ్డారు.
ఉప ఎన్నికల్లో తలబొప్పి కట్టడంతో..
వ్యవసాయ ప్రధాన రాష్ట్రం హరియాణలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ పరాజయం మోదీలో మార్పు తెచ్చిందా? అంటే ఇదీ ఓ కారణమని అనుకోవచ్చు. అయితే, పూర్తిగా అదే కారణమని భావించలేం. మరోవైపు వచ్చే ఏడాదిలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలున్నాయి. దీంతో మూడు వ్యవసాయ చట్టాల రద్దు ప్రకటన.. ఆ వెంటనే శీతాకాల సమావేశాల్లోనే ఆమోదం తదితరాలు జరిగిపోయాయి. దీంతో ఏడాది కాలంగా ఢిల్లీ శివార్లలో పోరాడిన భారతీయ కిసాన్ మోర్చా (బీకేయూ).. తదితర రైతు సంఘాల కూటమి సంయుక్త కిసాన్ మోర్చా తమ లక్ష్యాన్ని సాధించుకున్నట్లైంది. అసలు ఈ ఉద్యమం పంజాబ్ లో మొదలైంది. ఆ ఆందోళన తర్వాత ఉత్తరప్రదేశ్, ఆ తర్వాత హరియాణకు పాకింది. ఈ మూడు రాష్ట్రాల్లో ఆందోళనలు చివరకు పెద్ద ఉద్యమంగా మారి ఢిల్లీని ఒక ఊపు ఊపేశాయి. భాగస్వామ్య పక్షాలు వైదొలగడం, మిగతా పక్షాలు కూడా అంతగా సుముఖంగా లేని నేపథ్యంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పనిసరి అయింది. రాజకీయంగా తగిలిన ఈ ఎదురుదెబ్బలతో బీజేపీకి బుద్ధొచ్చినట్లయింది. తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని మోదీ హఠాత్తుగా వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నారు.
ఒక్కొక్కటిగా రైతుల డిమాండ్లు తీర్చుతూ..
అయితే వ్యవసాయ చట్టాల రద్దుతో సంతోషపడని రైతులు.. తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు ఢిల్లీ సరిహద్దును వీడబోమని స్పష్టం చేశారు. ఉద్యమం సందర్భంగా రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో వ్యవసాయ సంస్కరణల బిల్లును రద్దునూ కోరుతున్నారు. అంతేకాక, యూపీలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి కారును పోనిచ్చిన ఘటనలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని పట్టుబడుతున్నారు. ఈ ఘటనలో అజయ్ మిశ్రా కుమారుడే ప్రధానంగా పాల్గొన్నట్టు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఎంఎస్పీ కి రూపునిచ్చేందుకు కేంద్రం ఒక కమిటీని నియమించింది. ఇందులో సభ్యులను సిఫారసు చేయాలని రైతు సంఘాలను కేంద్రం కోరింది. కనీస మద్దతు ధర చట్టం రూపకల్పనకు కమిటి అంటే మోదీ రైతు సంఘాల ఒత్తిళ్లకు లొంగుతున్నట్లే అనుకోవాలి. ఇపుడు గనుక రైతుల డిమాండ్లలో కొన్నైనా నెరవేర్చకపోతే రాబోయే యూపీ, ఉత్తరాఖండ్ ఎన్నికల్లో దెబ్బ ఖాయమని అర్ధమైనట్లుంది. అందుకనే రైతు సంఘాలను మంచి చేసుకునేందుకు డిమాండ్లకు తలొంచుతున్నారు. ఎంతకాలం ఉద్యమం చేసినా పట్టించుకునేదే లేదని తెగేసి చెప్పిన ఇదే కేంద్ర ప్రభుత్వం ఒక్కో మెట్టు దిగుతోందంటే అదంతా ఎన్నికల్లో ఓటమి భయమే అని అందరికీ అర్ధమైపోతోంది. వ్యవసాయ చట్టాలు ముఖ్యమా లేకపోతే యూపీలో గెలుపు ముఖ్యమా అని చూసుకుంటే మోడి యూపీ ఎన్నికల్లో గెలుపువైపే మొగ్గారు.
యూపీలో ఓడితే కేంద్రంలో ఓడినట్టే..
400 పైగా అసెంబ్లీ సీట్లున్న యూపీలో ఎన్నికలు బీజేపీకి ఎంతో కీలకం. 80 లోక్ సభ సీట్లున్నఈ రాష్ట్రంలో గెలిచే పార్టీనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అలాంటిచోట బీజేపీ ఓడిపోయిందంటే అంతే సంగతులు. దీని ప్రభావం రాబోయే పార్లమెంటు ఎన్నికలపై పడుతుంది. నిజంగానే యూపీ ప్రభావం లోక్ సభ ఎన్నికలపై పడితే బీజేపీ అధికారంలోకి వచ్చేది కష్టమే. అంతేకాదు.. మోదీ ఏకఛత్రాధిపత్యానికీ అడ్డ కట్ట పడినట్టే. ఇతర పార్టీల బలంతో ప్రభుత్వాన్ని నడపాల్సొచ్చినా లేకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా బలం లేకపోయినా బీజేపీకి చాలా ఇబ్బందే. కాబట్టే.. కేంద్రం.. అంటే.. మోదీ మెట్లు దిగుతూ వస్తున్నారు.