ఆకాశంలో దేవుడి చెయ్యి .. ఫోటో షేర్ చేసిన నాసా

Update: 2021-09-30 10:30 GMT
2014 జనవరి 9న అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా .. ఓ అరుదైన అంతరిక్ష ఫొటోను తన వెబ్‌సైట్‌లో షేర్ చేసింది. అదో ఎక్స్-రే ఇమేజ్. చూడ్డానికి దేవుడి చెయ్యి లా కనిపిస్తున్నా, ఇందులో ఉన్నది పల్సార్ విండ్ నెబ్యులా అని తెలిపింది. ఓ సూపర్ నోవా నక్షత్రం పేలిపోవడంతో మబ్బులా ఏర్పడిన పదార్థమే ఇది అని నాసా వివరించింది. నాసాకి చెందిన న్యూక్లియర్ స్పెక్ట్రోస్కోప్ టెలిస్కోప్ ఎర్రే దీన్ని ఎక్స్-రే తీసింది.

ఆ ఫొటోకి సంబందించి తాజాగా నాసా అప్‌ డేట్ ఇచ్చింది. తాజాగా రిలీజ్ చేసిన ఫొటో అద్భుతంగా ఉంది. నాసా ప్రతి రోజు ఓ ప్రత్యేక ఫొటోను రిలీజ్ చేస్తుంది. దాన్ని ఇమేజ్ ఆఫ్ ది డే అని పిలుస్తుంది. అలాగే అప్పుడప్పుడూ నమ్మశక్యం కాని ఫొటోలను చూపిస్తుంది. అవి సోషల్ మీడియాలో తుఫానులా చెలరేగుతాయి. ఇదివరకు పదేళ్లపాటూ సూర్యుణ్ని ఫొటోలు తీసి, వాటన్నింటినీ జతచేసి ఓ వీడియోని రిలీజ్ చేసింది నాసా. గంటపాటూ ఉన్న ఆ వీడియో సూపర్ వైరల్ అయ్యింది.

తాజా ఫొటోని నాసాకి చెందిన చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ తీసింది. సూపర్ నోవా నక్షత్రం పేలిపోవడంతో వచ్చిన దుమ్ము, దూళి, పదార్థాలన్నీ కలిసి... ఇలా చెయ్యి ఆకారంలోకి మారాయి. ఇందులో పసుపు రంగులో ఉన్నది పల్సర్. ఇది చాలా శక్తిమంతమైనది. దీన్ని సైంటిఫిక్‌ గా PSR B1509-58 అని పిలుస్తారు. ఇది సుమారుగా 19 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. భూమి నుంచి 17,000 కాంతి సంవత్సరాల అవతల ఈ దృశ్యం ఏర్పడింది.

లేటెస్ట్ ఫొటోతో నాసా ఓ విషయం చెప్పింది. ఇందులోని పల్సర్... సెకండ్‌ కి 7 సార్లు తన చుట్టూ తాను తిరుగుతోంది. ఫొటోలోని దుమ్ము పదార్థాలు అయస్కాంత క్షేత్రంతో కనక్ట్ అయివుంటాయని తెలిపిన నాసా... అందువల్లే చెయ్యి లాంటి ఆకారం ఏర్పడి ఉండొచ్చని అభిప్రాయపడింది.


Tags:    

Similar News