అమెరికా నుంచి ఎన్నారైలు తిరిగి వచ్చేస్తున్నారా.. వైరల్ పోస్ట్!

దీంతో.. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఎన్నారై నిర్ణయాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రశంసిస్తున్నారు.;

Update: 2026-02-10 13:30 GMT

మెరుగైన ఉద్యోగ అవకాశాలు, జీవన ప్రమాణాలు, ఉజ్వల భవిష్యత్తు అనేవి చాలామంది భారతీయులు దేశాన్ని వదిలి వెళ్లడానికి చెప్పే సాధారణ కారణాలు! ఈ క్రమంలో.. అమెరికా వంటి దేశంలో వారు చెప్పినట్లు కెరీర్ పురోగతి ఎక్కువగా ఉన్నప్పటికీ... చాలామందికి సామాజిక ఒంటరితనం, ఊరిలో ఉన్న వృద్ధ తల్లితండ్రులను చూసుకోలేకపోతున్నామనే బెంగ, ఏదో మిస్సవుతున్నామనే అసంతృప్తి వారిలో చాలామందిని నిత్యం వెంటాడుతుంటాయని అంటారు! ఈ క్రమంలో ఓ ఆసక్తికర పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అవును... తాజాగా వైరల్ అవుతున్న రెడ్డిట్ పోస్ట్ లో ఓ ఎన్నారై స్పందిస్తూ... తాను ప్రతీ ఏటా రెండుసార్లు భారత్ లోని కోల్ కతా, ధన్ బాద్ కు పర్యటిస్తుంటానని.. ఇవి దేశంలోని అత్యంత జనసాంద్రత కలిగిన, కలుషితమైన, శబ్ధ కాలుష్యం ఎక్కువగా ఉన్న పెద్ద, చిన్న నగరాలని పేర్కొన్నారు. కానీ.. అక్కడ ఉన్నంత సేపూ ప్రతీ సెకనూ ఇల్లులా అనిపిస్తుందని అన్నారు. అయితే ఇప్పటి పరిస్థితులు ఒకప్పటిలా లేవని.. చాలా మారాయని చెప్పుకొచ్చారు.

ఇందులో భాగంగా... ఆ ప్రాంతానికి తిరిగి వెళ్లడానికి వ్యతిరేకంగా మాట్లడానికి ప్రధాన కారణాలైన ఆరోగ్య సమస్యలు, శ్వాసకోస సంబంధం సమస్యలు, మెరుగుపడని మౌలిక సదుపాయాలు, పెద్దగా కనిపించని సివిక్ సెన్స్ వంటివి భయాలు ఇప్పుడు లేవని.. పరిస్థితులు మారాయని, మౌలిక సదుపాయాలు చాలా మెరుగయ్యాయని రాసుకొచ్చారు! ఆదాయలు అంతటా పెరిగాయని, డోర్ డెలివరీలు, ఇతర వినోద వస్తువులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

అయితే... శబ్ధ కాలుష్యం, జనసమూహాలు వంటి మొదలైన సమస్యలను సర్దుబాటు చేసుకోవడానికి కాస్త సమయపడుతుంది కాబట్టి.. స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకునే ప్రతి ఒక్కారూ బాగా ప్లాన్ చేసుకోవాలని.. భారత్ లో మంచి ఇళ్లు కొనుక్కోవాలని.. సొంత వ్యక్తుల మధ్య జీవితాన్ని ఆస్వాధించాలని తన పోస్టులో కోరారు!

దీంతో.. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఎన్నారై నిర్ణయాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రశంసిస్తున్నారు. ప్రియమైనవారితో సన్నిహితంగా ఉండటం, వారితో కలిసి నివసించడం అనే భావనను మించింది ఏదీ లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో చాలామంది ఎన్నారైలు ఆయన నిర్ణయం గురించి తాము ఇప్పటికే ఆలోచించామని ఒకరంటే.. యూఎస్ లో కంటే భారత్ లోనే తన ఆరోగ్యం మెరుగుపడిందని మరొక ఎన్నారై స్పందించారు!

కాగా... 2005లో అమెరికా వీసా నిరాకరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తాను చేసిన వ్యాఖ్యలను ఇటీవల తిరిగి గుర్తుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఒక రోజు ప్రపంచం భారతీయ వీసా కోసం ఎదురు చూస్తుంది అని తాను చెప్పానని.. ప్రపంచ వేదికపై భారత్ తన స్థానాన్ని సంపాదించుకున్నందున మన దేశ ప్రపంచ స్థాయి నాటకీయంగా పెరిగిందని అన్నారు.

Tags:    

Similar News