• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పోలీస్ బాస్ ల్ని మోడీ...

పోలీస్ బాస్ ల్ని మోడీ అడిగిన ప్రశ్నఇదేనా?

By - Tupaki Desk
Update: 2016-11-26 05:33 GMT
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ రెండోసారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ఈసారి ఆయన తెలంగాణ పర్యటనకు కారణం హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో జరుగుతున్న డీజీపీ సదస్సుకు ఆయన హాజరయ్యారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆయన.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో విమానాశ్రయంలోనే ప్రత్యేకంగా పది నిమిషాలు భేటీ అయ్యారు.

అనంతరం పోలీస్ అకాడమీకి వెళ్లిన మోడీ.. అక్కడ డీజీపీల సదస్సుకు హాజరయ్యారు. పలువురు డీజీపీలతో మాట్లాడిన ప్రధాని.. ఒక కీలకాంశంపై ఆయన దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు? బ్యాంకులు.. ఏటీఎం కష్టాలపై గ్రౌండ్ రిపోర్ట్ ఏమిటన్న అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

పోలీస్ అకాడమీలో జరిగిన విందుకు హాజరైన ప్రధాని.. ఈ సందర్భంగా విందు చేస్తూనే పలువురు డీజీపీలతో మాటామంతి జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా నోట్ల రద్దు నిర్ణయం ఆయా రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిస్థితులు.. ప్రజల స్పందనల్ని తెలుసుకున్నారు. మోడీ ఆరా తీసిన డీజీపీల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు.. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల డీజీపీల నుంచి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం కనిపించింది. నోట్ల రద్దు పరిణామాలపై పలువురు డీజీపీలతో మోడీ మాట్లాడటం  గమనార్హం.
Tags:    
  • Narendra Modi 
  • DGPs 
  • Telugu News 
  • Telugu CInema News 

Similar News

చిరంజీవిది విలీనం.. విజయసాయి కొత్త ‘పీఆర్పీ’ లక్ష్యం చేరుతుందా?

2026-11-11 06:43 GMT

ఏపీలో రాజకీయ శూన్యత ...టీడీపీ వైసీపీ సంగతేంటి ?

2026-11-11 06:43 GMT

విజయసాయిరెడ్డి క్లాస్...పార్టీ పేరూ క్లాసే !

2026-11-11 06:16 GMT

సరికొత్త క్యాబ్స్ : రేటు తక్కువ.. కార్లు కంఫర్ట్.. వియత్నం కార్లతో 30వేల జీతం..

2026-11-11 05:59 GMT

కాలేజీల్లో సినిమా ప్రమోషన్లకు తెలంగాణ ప్రభుత్వం చెక్?

2026-11-11 05:57 GMT

హెచ్1బీ వీసాదారులపై మరో పిడుగు.. ఐబీఎం షురూ చేసింది..

2026-11-11 04:56 GMT

టాప్ స్టోరి: న‌గ‌ర శివారులో స్టార్ హీరోల ఫామ్‌హౌస్‌ల విలాసాలు

2026-11-11 04:29 GMT

2008లో ఆస్ట్రేలియా వెళ్లిన భారతీయ యువకుడు.. ఇప్పుడు ఆయన సాధించిన ఘనత ఏంటో తెలుసా?

2026-11-11 04:28 GMT

ధర్మాన బ్రదర్స్ చేతుల్లో గుండ ఫ్యామిలీ పొలిటికల్ లైఫ్

2026-11-11 03:55 GMT

కోలగట్ల హవాకు చెక్ పడినట్లేనా ?

2026-11-11 03:55 GMT

జగన్ డెసిషన్ షాకింగ్ అంటున్న మహాసేన రాజేష్

2026-11-11 03:54 GMT

జగన్ గ్రౌండ్ లోకి దిగాల్సిందే...లేకపోతే కష్టమేనట !

2026-11-11 03:52 GMT

Copyright @2026

Powered by Blink CMS