మోడీ నోటి వెంట ‘‘ధ్రువ’’ మాటలు
యాదృశ్చికమే అయినా.. ఆసక్తికరమైన విషయంగా దీన్ని చెప్పాలి. ఒక సినిమాలో హీరో పాత్ర లక్ష్యం మాదిరే దేశ ప్రధాని టార్గెట్ కూడా అలానే ఉండటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. తమిళ్ లో సూపర్ హిట్ అయిన తన్ని ఓరువన్ చిత్రాన్ని తెలుగులో ధ్రువగా తీయటం తెలిసిందే. చెర్రీ నటించిన ఈ చిత్రం ఈ మధ్యన రిలీజ్ అయి.. విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సినిమాలో హీరో చెప్పే టార్గెట్ మాదిరే ప్రధాని మోడీ లక్ష్యం ఉండటం.. హీరో పాత్ర సినిమాలో చెప్పే డైలాగ్ ను దాదాపుగా అదే రీతిలో వైనం చూసినప్పుడు.. నిజమేననిపించక మానదు.
ధ్రువ సినిమాలో హీరో చరణ్ పాత్ర చెప్పే డైలాగుల్లో పవర్ ఫుల్ డైలాగ్ లో ఒకటి.. వందమందిని శాసించే.. ప్రభావితం చేసే నేరస్తుడే తన టార్గెట్ అని.. అలాంటి వాడిని కానీ గురి చూసి దెబ్బ తీస్తే.. వందమంది నేరస్తుల్ని కట్టడి చేయొచ్చని చెబుతాడు. సరిగ్గా ఆ తరహాలోనే ప్రధాని నోటి వెంట తాజాగా వ్యాఖ్యలు రావటం గమనార్హం.
త్వరలో ఉత్తరాఖండ్ లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో.. అక్కడ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న మోడీ నోటి నుంచి ధ్రువ డైలాగు తరహాలోనే మాటలు ఉండటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ధ్రువలో హీరో పాత్రధారి చెప్పిన మాటల మాదిరే మోడీ మాటలు ఉన్నాయి. ఆ మాటలేమిటన్నది చూస్తే.. ‘‘నేను కొట్టిన దెబ్బకు నల్ల కుబేరులు విలవిలలాడుతున్నారు. నేరుగా దొంగల ముఠా నాయకుడ్నేగురిచూసి కొట్టాను. తగలాల్సిన వారికే దెబ్బ తగిలింది. అందుకే నేను తీసుకున్న నిర్ణయం కొందరికి రుచించటం లేదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
పెద్దనోట్ల రద్దు నిర్ణయం పుణ్యమా అని.. నల్లధనం.. తీవ్రవాదులకు నిధులు.. మనుషుల అక్రమ రవాణా.. మాఫియా.. లాంటి వ్యవస్థలన్నీ ఒకే దెబ్బకు ధ్వంసమయ్యాయన్నారు. ‘‘నల్లధనం.. పెద్దనోట్ల రద్దుతో బ్యాంకులకు వస్తోంది. నల్లధనాన్ని.. దేశాన్ని నాశనం చేసే నల్లకుబేరుల్ని తరిమికొట్టటం కోసం కాపలాదారుడి బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నా. అవినీతి కొందరి రక్తంలోనే ఉంది. అందుకే నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటిని నేను చూడటం లేదని అనుకుంటున్నారు. కానీ.. మాకన్నీ తెలుసు. అందుకే అడ్డదారులు తొక్కినోళ్లంతా దొరికిపోతున్నారు’’ అంటూ చెప్పారు. మోడీ మాటలు.. ధ్రువ హీరో లక్ష్యం ఒకేలా ఉన్నట్లు లేదు..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/