యువతకు మోడీ సరికొత్త ‘మంత్రం’

Update: 2020-07-16 12:30 GMT
కరోనాతో కల్లోలంగా ఉంది. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ఎంతో కీలకమని యువతకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. నైపుణ్యం అనేది మనమే స్వయంగా అలవరుచుకొని వృద్ధి చేసుకునేది కాదని.. అది మన కాళ్లపై మనల్ని నిలబెట్టేలా చేసి.. తోటివారికి ఉపాధి కల్పిస్తుందన్నారు.

ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ దేశంలోని యువతీ యువకులకు వీడియో ద్వారా తన సందేశాన్నిచ్చారు. ప్రపంచాన్ని పీడిస్తోన్న మహమ్మారి సంక్షోభాన్ని యువత నూతన ఉపాధి మార్గాలను అన్వేషించుకోవాలని సూచించారు. దీంతోపాటు ఉద్యోగ విపణిలో ధీటుగా నిలబడేందుకు సరికొత్త నైపుణ్యాలను అలవరుచుకోవాలని సూచించారు.

యువత స్కిల్, రీస్కిల్, అప్ స్కిల్ చాలా అవసరమని ప్రధాని మోడీ చెప్పారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత నూతన నైపుణ్యాలను పొందాలంటూ మోడీ సందేశమిచ్చారు. వలస కార్మికులకు తోడుగా నిలవాలని ప్రధాని మోడీ కోరారు. నైపుణ్యంగల కార్మికులకు ఉపాధి కల్పించాలని సూచించారు. స్కిల్ ఇండియా మిషన్ తో సుమారు 5 కోట్ల మంది యువత వివిధ రంగాల్లో తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నారని ఆయన తెలిపారు.
Tags:    

Similar News