ఈటలను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రశ్నలు వేసిన రేవంత్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన విశ్వరూపాన్ని చూపించారు.

Update: 2024-05-07 05:27 GMT

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యమంత్రి అయ్యేంత స్ట్రేచర్ రేవంత్ కు లేదంటూ కొందరు అదే పనిగా విమర్శిస్తుంటారు. కానీ.. గడిచిన నాలుగు నెలలుగా రేవంత్ పాలన చూసినప్పుడు ఆయనలో ఇప్పటివరకు కనిపించని కొత్త వ్యక్తి బయటకు రావటం కనిపిస్తుంది. రాష్ట్ర స్థాయి నాయకుడిగా గుర్తింపు ఉన్న రేవంత్.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాలుగు నెలల స్వల్ప వ్యవధిలోనే జాతీయ స్థాయిలో తన ఇమేజ్ ను పెంచుకోవటం కచ్ఛితంగా సక్సెస్ గా చెప్పాలి.

ఇవాల్టి రోజున రేవంత్ ను జాతీయస్థాయిలో గుర్తు పట్టే పరిస్థితి. దీనికి కారణం ఆయన నోటి మాటలే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరి మాటలతో ఆడుకోవటంతో పాటు.. లాజిక్ మిస్ కాని వాదన.. ప్రత్యర్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేసే అస్త్రాలతో పాటు.. ఉన్నది ఉన్నట్లుగా మాత్రమే చెబుతారన్న భావన కలిగేలా ఆయన తీరు ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతం చేసుకున్న విజయం గాలి వాటున వచ్చింది కాదని.. కష్టపడి సొంతం చేసుకున్న విషయాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత రేవంత్ మీద పడింది. అందుకు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు సానుకూలంగా ఉండాల్సిన పరిస్థితి.

Read more!

దీంతో.. సుడిగాలి పర్యటనలతో పెద్దఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. తాజాగా మల్కాజిగిరి ఎంపీ స్థానం పరిధిలో ప్రచారాన్ని నిర్వహించిన సందర్భంగా అక్కడ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై నిప్పులు చెరిగారు. పలు ప్రశ్నలతో ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. రేవంత్ ప్రశ్నలతో ఈటల తప్పనిసరిగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో నిజాయితీపరుడినని చెప్పుకునే ఈటల రాజేందర్ తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సీఎం రేవంత్ కోరటమే దీనికి కారణం.

ఇంతకూ ఈటెలను ఉద్దేశించి సీఎం రేవంత్ సంధించిన ప్రశ్నాస్త్రాలివే..

- 2001 నుంచి 2021 వరకు కేసీఆర్.. ఈటల వేర్వేరు కాదు ఒక్కరే అన్నట్లు వ్యవహరించలేదా?

- కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో రూ.వేల కోట్లు కేసీఆర్ దోచుకుంటే ఆ బిల్లులపై ఆర్థిక మంత్రిగా సంతకాలు పెట్టింది మీరు కాదా?

- ధరణి ముసుగులో అవుటర్ చుట్టూ దొరలు భూములు ఆక్రమించుకుంటుంటే కాపలా కాసింది మీరు కాదా?

- కేసీఆర్ ను కలిసేందుకు గద్దర్ వస్తే.. మండుటెండలో నిలబెట్టి పంపించారు. ఎందుకలా చేశారని కేసీఆర్ ను ప్రశ్నించారా?

- బీజేపీలో చేరాక ఉప్పల్ ఫ్లైవోర్ పనులు పూర్తి కాలేదెందుకు అని నితిన్ గడ్కరీని అడిగారా?

- రూ.వేల కోట్లు కేటీఆర్ దోచుకున్నారని ఎప్పుడైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశారా?

- జన్వాడలో ఫామ్ హౌస్.. గజ్వేల్ లో వెయ్యి ఎకరాల గురించి మోడీకి ఎందుకు వివరించలేదు?

- కేంద్ర ప్రభుత్వంలో మీ పార్టీ అధికారంలో ఉంది కదా? ముదిరాజ్ కులం బీసీ ‘డి’లో ఉంటే ఎందుకు మార్పించలేదు?

Tags:    

Similar News