అంత పెద్ద విమానయాన సంస్థ ఎంత చిల్లర పని చేసిందంటే?

వ్యాపారం అన్న తర్వాత లాభాలు అవసరం. ఆ పేరుతో అడ్డదారులు తొక్కటానికి మించిన తప్పు మరొకటి ఉండదు.

Update: 2024-05-07 05:46 GMT

వ్యాపారం అన్న తర్వాత లాభాలు అవసరం. ఆ పేరుతో అడ్డదారులు తొక్కటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. అందునా పేరున్న సంస్థలు అస్సలు చేయకూడదు. కానీ.. ఆ విషయాన్ని మర్చిపోయి.. ఎక్కువ లాభాల కక్కుర్తితో చేయకూడని పని చేసిన వైనం వెలుగు చూసింది. తాజాగా ఆ విమానయాన సంస్థకు భారీగా ఫైన్ వేశారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ఆస్ట్రేలియాకు చెందిన విమానయాన సంస్థ కాంటాస్ ఒక భారీ కుంభకోణానికి తెర తీసింది. ముందుగా రద్దు అయిన విమానాల్లోని టికెట్లను అమ్మేది. పలువురు.. ఈ విమానాల్లో ప్రయాణం కోసం టికెట్లు కొనుగోలు చేసేవారు. ఆ తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ కావటంతో వారు తీవ్రంగా నష్టపోయేవారు. దాదాపు 103 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఈ సంస్థ ఇలాంటి తప్పుడు పని చేయటాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఘోస్ట్ ఫ్లైట్స్ పేరుతో ఈ భారీ స్కాం పాపులరైంది.

ఈ విమానయాన సంస్థ తప్పుడు పనుల కారణంగా దాదాపు 86 వేల మంది ప్రయాణికులు నష్టపోయారు. లాభాల కక్కుర్తి కోసం చేసిన ఈ నిర్వాకాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ విమానయాన సంస్థలో టికెట్లు కొనుగోలు చేసిన పలువురు వ్యాపారులు.. ఉద్యోగులు.. పర్యాటకులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని ప్రస్తావించిన కోర్టు.. ఈ సంస్థకు 66 మిలియన్ డాలర్ల ఫైన్ వేసింది. అదే సమయంలో వీరి కారణంగా నష్టపోయిన 86 వేల మంది ప్రయాణికులకు 13 మిలియన్ డార్ల మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.

Read more!

తాము చేసిన తప్పుడు పనుల గురించి ఓపెన్ అయిన సంస్థ.. మూడు రోజుల ముందే రద్దు అయిన విమానాల టికెట్లను సైతం తాము అమ్మేవారిమని పేర్కొన్నారు. తమ కస్టమర్లకు తాము నష్టం కలిగించామని.. విలువల్ని పాటించటంలో ఫెయిల్ అయినట్లుగా పేర్కొన్నారు. ప్రయాణికులకు సరైన సమాచారాన్ని సకాలంలో పంపే విషయంలోనూ తాము విఫలమైనట్లుగా పేర్కొంటూ తమను క్షమించాలంటూ కాంటస్ సీఈవో వనెస్సా హడ్సన్ కోరారు. ఎన్నో కంపెనీల గురించి విని ఉంటాం కానీ మరీ ఇంత చిల్లరగా వ్యవహరించిన విమానయాన సంస్థ ఇదేనేమో?

Tags:    

Similar News