పిక్ టాక్: మోడీ కొత్త గెటప్
ప్రధాని నరేంద్రమోడీ ఇప్పటికే తన పేరిట బ్రాండ్ ను సెట్ చేశారు. ‘నమో’ పేరుతో ఆయన కుర్తా డ్రెస్ దేశవ్యాప్తంగా ఫేమస్. అంతేకాదు.. అప్పట్లో మోడీ పంపిన డ్రెస్ లు వేసుకొని దక్షిణ కొరియా అధ్యక్షుడు ‘నమో’ డ్రెస్ ను ఫాలో అయ్యారు. అలా మోడీ రంగురంగుల కుర్తా పంజాబీ డ్రెస్ కు ప్రపంచవ్యాప్తంగా ఓ బ్రాండ్ వచ్చేసింది..
తాజాగా అండమాన్ నికోబార్ దీవుల పర్యటనల్లో ఉన్న మోడీ నయా లుక్ లో దర్శనమిచ్చారు. దక్షిణాది నేతలు మాత్రమే కట్టే లుంగీ గెటప్ లో కనువిందు చేశారు. పైన పొడవాటి తెల్లటి చొక్కా.. కింద తెల్లటి లుంగీ కట్టుకొని చక్కటి ప్రకృతి సోయగం నడుమ సూర్యోదయాన్ని వీక్షిస్తూ కనిపించారు. ఎప్పుడూ కుర్తా పంజాబీ డ్రెస్ లో కనిపించే మోడీ ఇలా దక్షిణాది లుంగీ డ్రెస్ లో కనిపించడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు..
మోడీ నయా లుంగీ లుక్ ను తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. అండమాన్ రాజధాని పోర్ట్ బ్లెయిర్లో సూర్యోదయాన్ని మోడీ చూస్తున్న ఫొటోను పంచుకుంటూ ‘‘మన స్వేచ్ఛ కోసం తమ జీవితాలను తృణప్రాయంగా అర్పించి దేశానికి స్వాతంత్ర్యం దక్కేందుకు కృషి చేసిన మహనీయుల ధైర్య సాహసాలను గురించి ఆలోచిస్తున్నా’’ అని చక్కటి సందేశాన్ని జోడించారు. ఏది ఏమైనా మోడీ తొలి లుంగీ గెటప్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
Full View