• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నరేంద్రమోడీ బయోపిక్ కు యూ...

నరేంద్రమోడీ బయోపిక్ కు యూ సర్టిఫికెట్!

By - Tupaki Desk
Update: 2019-04-10 05:42 GMT
ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ బయోపిక్ సెన్సార్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 'యూ' సర్టిఫికేషన్ ఇచ్చింది. అనేక అవాంతరాల మధ్యన ఈ సినిమా సెన్సార్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అభ్యంతకరమైన సన్నివేశాలు లేవన్నట్టుగా, అన్ని వయసుల వారూ చూడదగిన సినిమాగా దీనికి యూ సర్టిఫికెట్ దక్కింది.

ఈ సినిమా విడుదల విషయంలో కాంగ్రెస్ వాళ్లు తీవ్రంగా అభ్యంతరాలు తెలిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ఈ సినిమా విడుదల కావడానికి వీల్లేదంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అభ్యంతరం చెప్పారు. దీనిపై కోర్టుకు కూడా వెళ్లారు. అయితే కోర్టులో కాంగ్రెస్ పార్టీ వాదన వీగిపోయింది. నరేంద్రమోడీ బయోపిక్ విడుదలకు కోర్టు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా రేపు విడుదల కాబోతోంది. దేశ వ్యాప్తంగా ఏప్రిల్ పదకొండున ఈ సినిమా విడుదల అవుతోంది. అదే రోజున సార్వత్రిక ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ముందు ఈ సినిమా విడుదల కావడానికి వీల్లేదని కాంగ్రెస్ అంటే.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తొలి దశ రోజునే ఈ సినిమా విడుదల అవుతుండటం గమనార్హం.

ఈ సినిమాలో నరేంద్రమోడీ పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషించిన సంగతి తెలిసిందే. అయితే మోడీగా వివేక్ లుక్ కు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ సినిమాలో అతడు అటు వివేక్ ఒబెరాయ్ లానూ లేడు, ఇటు నరేంద్రమోడీలానూ లేడంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు.

మరి అన్ని అడ్డంకులనూ దాటుకుని నరేంద్రమోడీ బయోపిక్  రేపు విడుదల కాబోతోంది. దీని బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉంటుందో! ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో!
Tags:    
  • Narendra Modi Biopic 
  • U Certificate 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

విశాఖ కొత్త మేయర్ ఇంట పెను విషాదం.. కూతురి ప్రమాణస్వీకారం చూడకుండానే తండ్రి కన్నుమూత

2026-11-20 17:23 GMT

ఉత్తరాదికి అందలం.. దక్షిణాదికి మొండిచేయి.. అభివృద్ధి అంటే భవనాలు కట్టడమేనా మోదీజీ?

2026-11-20 17:23 GMT

రాజమండ్రిలో ఆసక్తికర పోటీ.. హర్షకుమార్ కోడలు, వైసీపీ రెబల్ ప్రభావం ఎంత?

2026-11-20 17:22 GMT

Copyright @2026

Powered by Blink CMS