తంబీలు పిధా అయ్యేలా చేసిన మోడీ

Update: 2017-11-07 09:51 GMT
తెలుగు మీడియా పెద్ద‌గా క‌వ‌ర్ చేయ‌లేదు కానీ.. ఈ మ‌ధ్య‌న చెన్నైలో భారీ వ‌ర్షం కురిసింది. దీంతో.. చెన్నై మ‌హాన‌గ‌రం మ‌రోసారి ఆగ‌మాగ‌మైంది. భారీ ఎత్తున కురిసిన వ‌ర్షాల ధాటికి అత‌లాకుత‌ల‌మైన చెన్నై మ‌హాన‌గ‌రానికి ప్ర‌కృతి కార‌ణంగా భారీ న‌ష్ట‌మే వాటిల్లింద‌ని చెబుతున్నారు.

వ‌ర్షాల‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ‌.. ప్ర‌కృతి వైప‌రీత్యానికి క‌నీసం ఓ వెయ్యి కోట్లు సాయాన్ని ప్ర‌క‌టించాల‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కోరినా మోడీ పెద్ద‌గా రియాక్ట్ కాలేదు. ప్ర‌తిపాద‌న‌ల్ని పంపండి చూస్తామ‌న్న మాట‌ను చెప్పారు. నిధులు ఇవ్వ‌టంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించే మోడీ.. మ‌న‌సుల్ని దోచుకునే విష‌యంలో మాత్రం చాలాముందుంటారు.

ఖ‌ర్చు కాకుండా.. నిధులు తీయ‌కుండానే అంద‌రిని సంతృప్తి ప‌రిచే స‌మ్మోహ‌నాస్త్రం మోడీలో ఎక్కువే. త‌న కార్యాల‌యంలో ప‌ని చేసే సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి ఇంట్లో పెళ్లి వేడుక‌తో పాటు.. ప్ర‌ముఖ మీడియా సంస్థ దిన‌తంతి ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు చూస్తే.. మోడీ స‌మ్మోహ‌న శ‌క్తి వ్యూహం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ప్ర‌త్యేక విమానంలో చెన్నై చేరుకున్న మోడీకి ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌.. ముఖ్య‌మంత్రి.. ఉప ముఖ్య‌మంత్రి.. బీజేపీ నేత‌లు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అక్క‌డి నుంచి హెలికాఫ్ట‌ర్ లో అడ‌యార్ ఐఎన్ ఎస్‌ కు చేరుకొని అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో మ‌ద్రాస్ వ‌ర్సిటీకి చేరుకున్నారు.

దారిలో మెరీనాలో ఉన్న కార్మికుల విగ్ర‌హం వ‌ద్ద ఆగి.. వాహ‌నం బ‌య‌ట‌కు వ‌చ్చి అక్క‌డి వారికి అభివాదం చెప్పి ఉత్సాహప‌రిచారు. దిన‌తంతి కార్య‌క్ర‌మానికి వెళ్లిన సంద‌ర్భంగా అక్క‌డి నిర్వాహ‌కులు తాము ఏర్పాటు చేసిన ప్ర‌ద‌ర్శ‌న‌ను త‌న‌కు మాత్ర‌మే చూపిస్తున్న వేళ‌.. గ‌వ‌ర్న‌ర్ ను కూడా ప‌ట్టించుకోవాల‌న్న‌ట్లుగా త‌న‌దైన శైలిలో ముందుకు పిలిచారు. దీంతో.. అక్క‌డి వారికి గ‌వ‌ర్న‌ర్‌ కి త‌గిన మ‌ర్యాద ఇవ్వాల‌న్న విష‌యం అర్థ‌మ‌య్యేలా చేశారు.

దిన‌తంతి కార్య‌క్ర‌మం పూర్తి అయ్యాక వేదిక దిగి వ‌చ్చిన మోడీ.. ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ ఫోటో అన్ని మీడియా సంస్థ‌లు అచ్చేశాయి.

కానీ.. ఇక్క‌డో మ‌రో కీల‌క‌మైన ప‌ని చేశారు మోడీ. అక్క‌డున్న ప‌లువురు సినీ..రాజ‌కీయ ప్ర‌ముఖుల్ని ప‌ట్టించుకోవ‌ట‌మే కాదు. రెండో వ‌రుస‌లో ఉన్న వైగో లాంటి నేత‌ను స్వ‌యంగా గుర్తించిన‌ట్లుగా పిలిచి మ‌రీ ప‌క్క‌న పెట్టుకొని మాట్లాడ‌టం చేశారు. దీంతో ఆయ‌న ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇలా ప‌లువురి విష‌యంలో తెలివిగా వ్య‌వ‌హ‌రించిన మోడీ.. స‌భ‌కు వ‌చ్చిన వారికి త‌న‌పై ప్రేమాభిమానాలు పొంగేలా చేసుకోగ‌లిగారు.

అనంత‌రం అక్క‌డ నుంచి బ‌య‌ట‌కు వెళ్లే క్ర‌మంలో మెరీనా బీచ్ ద‌గ్గ‌ర త‌న‌ను చూడాల‌ని భావిస్తూ.. అక్క‌డ చేరుకున్న వారిని చూసిన ఆయ‌న కాన్వాయ్‌ ను నెమ్మ‌దిగా పోనివ్వాల‌ని ఆదేశించారు. ఆయ‌న ఆర్డ‌ర్ తో కాన్వాయ్ వాహ‌నాలు నెమ్మ‌దిగా క‌దిలాయి. ఇదంతా త‌మ కోస‌మే అన్న భావ‌న అక్క‌డ వారికి క‌లిగేలా చేయ‌ట‌మే కాదు.. మోడీ లాంటోడు త‌మ‌ను గుర్తించార‌న్న ఆనందానికి వారికి క‌లుగ‌జేశారు. దీంతో.. వారు ఉత్సాహంతో చేతులు ఊప‌టం.. స్పంద‌న‌గా అక్క‌డున్న వారు రియాక్ట్ కావ‌టం జ‌రిగిపోయాయి. ఇలా త‌న చెన్నై ప‌ర్య‌ట‌న‌లో అడుగ‌డుగా  జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించిన మోడీ.. ప‌లువురి మ‌న‌సుల్ని దోచుకున్నాడ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News