బీటెక్ రవికి పులివెందులలో వినూత్న నిరసన!

ఇక ఇలా ఊరు విడిచి వెళ్ళిన వారు అంతా వేరే చోట విందు భోజనాలు ఏర్పాటు చేసుకుని మరీ టీడీపీకి తమ నిరసన అలా చూపించారు అన్న మాట.;

Update: 2025-12-15 03:48 GMT

పులివెందుల టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న బీటెక్ రవికి ఆ నియోజకవర్గంలోని ఒక గ్రామంలో నిరసన సెగ గట్టిగానే తగిలింది. విషయంలోకి వెళ్తే చాలా ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డెవలప్మెంట్ గానే చూస్తున్నారు. వేంపల్లె మండలంలోని అమ్మాయిగారిపల్లెకు బీటెక్ రవి ఆదిరావం వస్తున్నారు అన్నది తెలుసుకుని ఆ గ్రామస్తులు అంతా ఇళ్ళకు తాళాలు వేసి మరీ వినూత్న తరహాలో నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఏకంగా వారు ఊరు విడిచిపోవడం సంచలనం సృష్టించింది.

టీడీపీలోకి చేరిక :

ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే అమ్మాయి గారి పల్లె లో మూడు కుటుంబాలు టీడీపీలోకి చేరుతున్నాయి. వారిని తమ పార్టీలోకి చేర్చుకోవడానికి బీటెక్ రవి వస్తూండడంతో మిగిలిన గ్రామ ప్రజలు అంతా ఇలా ఊరే వదిలి వెళ్ళిపోయారు అన్న మాట. పసుపు కండువా అన్నది తమ ఊరిలోనే లేదని ఎలా కప్పుతారు అన్నది వారి వాదనగా ఉంది. ఇక అమ్మాయి గారి పల్లె గ్రామం చూస్తే ఫక్తు వైసీపీ మద్దతు గ్రామం. ఆ ఊరిలో దాదాపుగా అన్ని ఓట్లూ వైసీపీకే పడతాయి. అలాంటిది అందులో చీలిక రావడం మూడు కుటుంబాలని టీడీపీ తన వైపునకు తిప్పుకోవడంతో ఇది రాజకీయంగా కూడా సంచలనం రేపింది.

విందు భోజనాలతో :

ఇక ఇలా ఊరు విడిచి వెళ్ళిన వారు అంతా వేరే చోట విందు భోజనాలు ఏర్పాటు చేసుకుని మరీ టీడీపీకి తమ నిరసన అలా చూపించారు అన్న మాట. ఇలా ఊరికి ఊరు ఒక్కసారిగా ఖాళీ చేయడంతో అమ్మాయి గారి పల్లె గ్రామం అంతా పూర్తి నిర్మానుష్యంగా మారింది అని అంటున్నారు. ఇక చూస్తే కనుక ఊరిలో టీడీపీలో చేరబోయే ఆ మూడు కుటుంబాలు తప్ప మరేమీ కనిపించని పరిస్థితి ఉందని అంటున్నారు.

ముఖం కూడా చూడొద్దని :

ఇక టీడీపీ వారు తమ గ్రామం వస్తున్నారు కాబట్టి వారి ముఖం కూడా చూడకూడదు అన్న పట్టుదలతో గ్రామస్తులు ఉండడంతో ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు అని అంటున్నారు. లాయర్ ఈశ్వరరెడ్డి, ఆయన తమ్ముడు, మరికొన్ని కుటుంబాలు బీటెక్ రవి సమక్షంలో టీడీపీలో చేరారు అని అంటున్నారు. ఇలా ఒక గ్రామం గ్రామం నిరసన చేస్తూ ఊరు విడిచి వెళ్ళిపోవడం అంటే రాజకీయంగా ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే కనుక ఇలా ఊరి బయటకు వచ్చేసిన కుటుంబాలకు విందు భోజనం ఏర్పాట్లకు టీడీపీ కీలక నేత సతీష్ రెడ్డి పర్యవేక్షించారు. ఆయనే పోలీసులతో మాట్లాడి మరీ వారి బహిరంగ విందుకు అనుమతి వచ్చేలా చూశారు. వైసీపీకి ఇది ఎంతో బూస్టింగ్ ఇచ్చే ఘటనగా భావిస్తున్నారు. ఈ రోజుకీ పులివెందులలో వైసీపీ బలం అలాగే ఉందని చెక్కు చెదరలేదని అంటున్నారు. చూడాలి మరి వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. మరెన్ని గ్రామాలలో ఇలాంటి చీలికలు వస్తాయో, ఇంకెన్ని నిరసనలు ఈ విధంగా చూడాలో అన్నది కూడా ఉంది. ఏ పార్టీకైనా ఇది తప్పదని అంటున్నారు.

Tags:    

Similar News