సర్పంచ్ గా గెలిచాడు... ఆత్మహత్య చేసుకున్నాడు

ఇక రెండవ విడతగా ఈ నెల 14న ఆదివారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లఒ పోలింగ్ జరిగి ఫలితాలు వచ్చాయి.;

Update: 2025-12-15 03:50 GMT

జీవితం అంటే ఎంతో విలువైనది గ్రహించలేక పోయాడు. ఊరికి సర్పంచ్ గా నెగ్గాలని చూశాడు. మరి అది ఎంతో బరువైన బాధ్యత. పంచాయతీలో ఎందరి సమస్యలనో పరిష్కరించాల్సిన పెద్దరికం తో ఉండాల్సిన వాడు బేలగా ఉండకూడదు కదా. నాయకుడు అంటే సమస్యలు అన్నీ కలసికట్టుగా చుట్టుముట్టి వచ్చినా బెదిరి వెన్ను చూపకూడదు కదా. కానీ ఆ సర్పంచ్ అభ్యర్థి అదే చేశాడు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేశారు. కానీ మధ్యలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఫలితాలు చూస్తే బిగ్ ట్విస్ట్, అతన్నే జనాలు గెలిపించి వరమాల వేశారు.

డబ్బులు లేవని :

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పీపడ్పల్లి గ్రామానికి సర్పంచ్ పదవి కోసం ఎన్నికలు జరిగితే చాల్కి రాజు అనే ముప్పయి అయిదేళ్ళ అభ్యర్థి పోటీ చేశాడు. అతనికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అయితే పోటీకి దిగిన తరువాత ప్రచారానికి డబ్బులు లేవని భావించాడు. ఇక తననే పోటీ చేయమని అంతా చెప్పిన వారు ప్రోత్సహించిన వారు కూడా ప్రచారానికి డబ్బులు సర్దలేకపోవడంతో పాటు మౌనం వహించడం కూదా రాజుని బాధించింది. అంతే ఒక క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అలా ఈ నెల 8న రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

విజేత అతనే :

ఇక రెండవ విడతగా ఈ నెల 14న ఆదివారం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లఒ పోలింగ్ జరిగి ఫలితాలు వచ్చాయి. రిజల్ట్ చూస్తే కనుక చాల్కి రాజు ఎనింది ఓట్ల తేడతో విజయం సాధించాడు. అంటే అతను మరణించినా జనాలు మాత్రం అభిమానంతో ఆయనకే ఓటు వేసి గెలిపించారు అన్న మాట. ఇక్కడ అంకెల మ్యాజిక్ ఏంటి అంటే చాల్కి రాజు 8వ తేదీన మరణించాడు, 8 ఓట్లతోనే గెలిచాడు. ఇలా నంబర్ మ్యాజిక్ చేసి అతన్ని విజేతగా చేస్తే జీవితం మాత్రం అతన్ని ముందే ఓడించేసింది.

మళ్ళీ ఎన్నికలు :

దాంతో అతను కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు అభిమానులు అంతా కూడా బోరున విలపిస్తున్నారు పైగా అయ్యప్పమాల వేసుకుని మరీ ఉరి వేసుకోవడంతో మరింత బాధకు గురి అవుతున్నారు. ఇక రాజు ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన విజేతగా తీర్పు వచ్చినా మరోసారి అక్కడ ఎన్నికలు తప్పడం లేదు. చూడాలి మరి ఈసారి ఎవరిని ఊరి జనం విజేతగా గెలిపిస్తారో.

Tags:    

Similar News