శ్రీదేవి సినిమాను చూసిన చిన‌బాబు

Update: 2017-07-10 09:41 GMT
నిత్యం బిజీబిజీగా ఉన్న రాజ‌కీయ ముఖ్య‌నేత‌లు సినిమాలు చూడ‌టానికి స‌మ‌యాన్ని కేటాయించ‌లేక‌పోతుంటారు. కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసేందుకు.. వారితోకాలం గ‌డిపేందుకే టైం లేని వారు.. ఒక సినిమా కోసం మూడు గంట‌ల స‌మ‌యాన్ని కేటాయించ‌టం కాస్తంత అరుదైన విష‌య‌మే.

ఇక‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కుమారుడు క‌మ్ రాష్ట్ర మంత్రి నారాలోకేశ్ లాంటి నేత‌కు టైం అస్స‌లు చిక్క‌ద‌నే చెప్పాలి. ఎందుకంటే.. రాజ‌కీయంగా ఆయ‌న విజ‌య‌వాడ‌లో ఉంటుండ‌గా.. ఆయ‌న కుటుంబం మొత్తం హైద‌రాబాద్ లో ఉంటోంది. దీంతో.. కుటుంబానికే టైం కేటాయించ‌లేని ప‌రిస్థితి లోకేశ్‌ కు ఉంద‌ని చెబుతారు.

ఈ మ‌ధ్య‌న ఒక ఇంట‌ర్వ్యూలో లోకేశ్ స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణి మాట్లాడుతూ.. మంత్రి అయ్యాక లోకేశ్ మ‌రీ బిజీ అయిపోయార‌ని.. చివ‌ర‌కు మెసేజ్ లు  కూడా అంద‌టం లేద‌ని చెప్పారు. అంత బిజీబిజీగా ఉండే లోకేశ్‌.. కాస్త వీలు చేసుకొని మ‌రీ ఒక సినిమాకు వెళ్ల‌టం విశేషంగా చెప్పాలి. ప్ర‌ముఖ న‌టి శ్రీదేవి న‌టించిన మామ్ చిత్రాన్ని తాజాగా ఆయ‌న చూశారు. సినిమా గురించి ట్విట్ట‌ర్ లో పేర్కొంటూ.. శ్రీదేవి 300వ సినిమా మామ్ చూశాన‌ని.. చాలా అద్భుతంగా ఉంద‌న్నారు. ఆమె న‌ట‌న ఔట్ స్టాండింగ్ అని.. సినిమాలోని ప్ర‌తి నిమిషాన్ని తాను ఎంజాయ్ చేసిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. లోకేశ్ ప్ర‌శంస‌ల్నికాసేపు ప‌క్క‌న పెడితే..పాజిటివ్ బ‌జ్ తో ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌నే కొల్ల‌గొడుతోంది. ఏమైనా.. మామ్ మూవీ కోసం లోకేశ్ కాసిన్ని గంట‌లు కేటాయించ‌టం గొప్పే.
Tags:    

Similar News