ఆ రెండు నియోజకవర్గాలపై లోకేశ్‌ కన్ను..!

Update: 2019-03-09 04:40 GMT
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మరోసారి అధికారం చేపట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. పార్టీ అధినేతతో పాటు ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ సైతం పార్టీ గెలుపు కోసం  శతవిధాలుగా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే లోకేశ్‌ నియోజకవర్గం ఖరారుపై పార్టీలో సస్పెన్స్‌ నెలకొంది.ఇప్పటి వరకు కర్నూలు - ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ పార్టీ అధినేత నుంచి మాత్రం గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదు. అయితే లోకేశ్‌ మాత్రం ప్రస్తుతం రెండు నియోజకవర్గాలపై ఫోకస్‌ పెట్టాడట. వాటిలో ఏది బెస్ట్‌ అనేదానిపై ఆలోచన చేస్తున్నాడట.

గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు, విశాఖ నార్త్‌. ఈ రెండు నియోజకవర్గాల పేర్లు పార్టీలో జోరుగా వినిపిస్తున్నాయి. ఈ రెండింటిలో లోకేశ్‌ ఎక్కడో ఒకచోట పోటీ చేసే అవకాశం ఉందట. గుంటూరు జిల్లా పెదకూరపాడులో 2009 - 2014లో వరుసగా టీడీపీ విజయం సాధించింది. ప్రస్తుతం కొమ్మాలపాటి శ్రీధర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం బలంగా ఉందని రాజకయ వర్గాలు చెబుతున్నాయి. గుంటూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి ఈ ప్రాంతమంతా ప్రభావం చూపనుందని, ఇదే తరుణంలో పెదకూరపాడులో పోటీ చేస్తే ఎలా ఉంటుందన్నది లోకేశ్‌ ఆలోచనట.

ఇక విశాఖ నార్త్‌ వైపు కూడా లోకేశ్‌ చూస్తున్నాడట. అయితే లోకేశ్‌ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని అక్కడి తెలుగు తమ్ముళ్లు బలంగా కోరుతున్నారట. ఇదే సమయంలో కృష్ణా, గుంటూరు నియోజకవర్గంలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలన్న వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు భీమిలి పేరు వినిపించినా అక్కడ గంటాకు చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. గతంలో మంగళగిరి పేరు కూడా వినిపించింది. దీంతో స్థానిక టీడీపీ నాయకులు సైతం ఇక్కడి నుంచే పోటీ చేయాలని లోకేష్ ను కోరారట..  మంగళగిరి చూట్టూ జరుగుతున్న అభివృద్ధి లోకేశ్‌కు భారీ మెజారిటీ తెస్తుందని విన్నవించారట.. పెలుమలూరు నుంచి కూడా పోటీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే  బోడె ప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు. ఇక్కడ లోకేశ్‌ పోటీ చేస్తే తాను తప్పుకుంటానని కూడా ప్రకటించాడు. అయితే బోడెకు చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు.

ఇలా లోకేశ్‌ కోసం కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ లు త్యాగశీలురుగా మారి పోటీ చేయాలని పెద్ద ఎత్తున కోరుతున్నారట.. కానీ పార్టీ అధినేత చంద్రబాబు కొడుకు లోకేష్ ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తేవడానికి తటపటాయిస్తున్నాడట..  తాజాగా వెలువడుతున్న సమాచారం ప్రకారం.. లోకేశ్‌ పెదకూరపాడు నుంచి పోటీ చేయాలని చూస్తున్నాడట. ఎన్నికల నోటిఫికేషన్‌  వెలువడడానికి కొద్ది రోజులే గడువు ఉన్న నేపథ్యంలో లోకేశ్‌ పోటీపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Tags:    

Similar News