కేసీఆర్ బయటకు వచ్చారు...జగన్ కూడా యాక్టివ్ అవుతారా ?

అదే విధంగా తెలంగాణాలో ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం కేసీఆర్, అలాగే ఏపీ మాజీ సీఎం ప్రతిపక్ష నేత జగన్ ల మధ్య కూడా చాలా పోలికలు ఉన్నాయి.;

Update: 2025-12-22 06:30 GMT

అదేంటో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ పోలికలు అంతా చూస్తూ ఉంటారు. విశ్లేషించుకుంటూంటారు. అక్కడ ఏమి జరిగినా ఏపీ వైపు చూస్తారు, అలాగే ఏపీలో ఏ విశేషం ఉన్నా తెలంగాణాలోనూ అది చర్చ అవుతుంది. ఇది అభివృద్ధి లోనే కాదు దైనందిన రాజకీయంలోనూ కనిపిస్తోంది. ఇక్కడ మరో ముచ్చట కూడా ఉంది. అదేంటి అంటే తెలంగాణాలో ఏపీలో అధికార పక్షాలు రెండూ సయోధ్యతో ఉంటే రెండు చోట్ల విపక్ష నేతలు ఇద్దరూ కూడా సన్నిహితంగా ఉండటం. రేవంత్ రెడ్డి చంద్రబాబుల మధ్య పార్టీలు వేరు అయినా ప్రాంతాలు రాజకీయాలు అవసరాలు వేరు అయినా ప్రత్యర్థులుగా ఉన్నా శత్రువులుగా మాత్రం రిలేషన్స్ అయితే లేవు. కలిసి కూర్చుని మాట్లాడుకునే అనుకూలత ఉంది. అదే విధంగా తెలంగాణాలో ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం కేసీఆర్, అలాగే ఏపీ మాజీ సీఎం ప్రతిపక్ష నేత జగన్ ల మధ్య కూడా చాలా పోలికలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ కదలికలను చూసిన వారు ఏపీలో జగన్ వైపు కూడా చూస్తారు.

కూడబలుక్కున్నట్లుగా :

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు పవర్ ఫుల్ ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. వారే కేసీఆర్ జగన్. ఈ ఇద్దరూ నీటిలో నిప్పులు పుట్టించగల సమర్ధులు. అయితే ఈ ఇద్దరూ గత రెండేళ్ళుగా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. కేసీఆర్ కేరాఫ్ ఎర్రవెల్లి ఫాం హౌస్ అయితే జగన్ కేరాఫ్ బెంగళూరు అన్నట్లుగా సాగింది. ఈ ఇద్దరూ ప్రజా క్షేత్రంలోకి పెద్దగా రావడం లేదు. కూడబలుక్కున్నట్లుగానే ఇద్దరూ తెర వెనక్కు వెళ్ళారు, అది వ్యూహాత్మకమైన మౌనమా లేక మరోటా అన్నది వారికే తెలియాలి. అయితే తన మౌనం వెనక వ్యూహం ఉందని తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. అంతే కాదు ఐ యాం ఆన్ దా ఫీల్డ్ నౌ అంటూ బిగ్ సౌండ్ చేశారు. ఇక నుంచి తాను ప్రజలకు అందుబాటులో ఉంటాను అని బలమైన సంకేతాలనే కేసీఆర్ ఇచ్చేశారు అన్న మాట.

జగన్ మీదనే ఫోకస్ :

ఈ నేపథ్యంలో కేసీఆర్ కి మంచి మిత్రుడుగా అంతా భావించే జగన్ మీద పొలిటికల్ గా ఫోకస్ పెరుగుతోంది. ఏపీలో అయితే జగన్ పెద్దగా ఫీల్డ్ లోకి రావడంలేదు, అక్కడ కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళడం లేదు, ఏపీలో జగన్ కూడా అసెంబ్లీకి బాయ్ కాట్ ని కట్నియూ చేస్తున్నారు. మరి కేసీఆర్ ప్రత్యక్ష పోరాటాలకు రెడీ అంటున్న వేళ జగన్ మార్క్ అజెండా ఏంటి ఆయన యాక్షన్ ప్లాన్ ఏంటి అన్న చర్చ కూడా సాగుతోంది. జగన్ సైతం జనంలోకి రావాలని అనుకుంటున్నారు అని చాలా కాలంగా వినిపిస్తున్న మాట. అయితే కేసీఆర్ తనకు అందివచ్చిన అవకాశాలను పుచ్చుకుని జనంలోకి వెళ్ళేందుకు రూట్ వేసుకుంటున్నారు. మరి ఏపీలో జగన్ కి రాజకీయ అనుకూల వాతావరణ సెట్ అయినట్లేనా అన్నది కూడా చర్చకు వస్తోంది.

పల్స్ దొరికితేనే :

ఏపీలో చూస్తే స్థానిక ఎన్నికలు ముందు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే సీన్ ఉంటుంది. మరి మూడు పార్టీల కూటమిని ఎదిరించి వైసీపీ తన ఉనికిని బలంగా చాటుకోవాలంటే జగన్ కూడా ఇప్పటి నుంచే ఫుల్ యాక్టివ్ కావాలని అంటున్నారు. అయితే వైసీపీలో జరుగుతున్న చర్చ మేరకు కొత్త ఏడాది అంటే 2026 నుంచి జగన్ జనంలోకి వస్తారు అని అంటున్నారు. కేసీఆర్ అయితే నీటి సెంటిమెంట్ తో పల్లెల్లోకి చొచ్చుకుని పోవాలని చూస్తున్నారు మరి జగన్ కి అలాంటి సెంటిమెంట్ అస్త్రం ఏదైనా ఉందా అన్నది కూడా చూస్తున్నారు. రాజకీయాలు సజావుగా విపక్షంలో ఉన్నపుడు సాగాలీ అంటే బలమైన అస్త్రాలు ఉండాలి. ఏపీలో కూటమి చాలా జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. మరి జనాన్ని తట్టిలేపే పవర్ ఫుల్ ఇష్యూ వైసీపీకి ఏదైనా ఉందా అన్నదే చర్చ. అలాంటి ఇష్యూతో వైసీపీ అధినేత జగన్ ఫీల్డ్ లోకి వస్తేనే ఆయన ఇమేజ్ తో పాటు వైసీపీ గ్రాఫ్ కూడా ఒక్కసారిగా పెరుగుతుందని అంటున్నారు. మరి ఇప్పటికైతే వైసీపీలో అంతర్మధనం సాగుతోంది. ఆ అవుట్ కం ఏమిటి అన్నది చూస్తేనే కనుక జగన్ ఐ యాం ఆన్ ద ఫీల్డ్ నౌ అన్న స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది అని అంటున్నారు. సో ఇపుడు అందరి ఫోకస్ జగన్ మీదనే అన్నది నిజం.

Tags:    

Similar News