ప్రపంచ కుబేరుడికి పెద్ద దెబ్బే కానీ.. మనం సేఫేనా..!

అవును... ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ పంపిన శాటిలైట్ (స్టార్ లింక్ - 35956) లో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది.;

Update: 2025-12-22 06:32 GMT

700 బిలియన్ డాలర్ల సంపద మార్కును దాటి, ఈ భూగ్రహంపై అత్యంత ధనవంతుడిగా ఎదిగిన ఉత్సాహంలో ఉన్న టెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కు బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా... స్పేస్ ఎక్స్ సంస్థ స్టార్ లింక్ ప్రాజెక్ట్ లో భాగంగా మొహరించిన ఓ ఉపగ్రహం అదుపుతప్పింది. భూమి నుంచి 418 కి.మీ ఎత్తులో ఉన్నప్పుడు ఇందులో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇదే సమయంలో దీనివల్ల భూమిపై ఉన్న మనం సేఫేనా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

అవును... ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ పంపిన శాటిలైట్ (స్టార్ లింక్ - 35956) లో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తింది. దీంతో.. ఇది ఆకాశం నుంచి భూమివైపు దూసుకొస్తుంది. అయితే దీని ఫెయిల్యూర్ కు కారణం ప్రొపల్షన్ సిస్టమ్ లో సమస్య అని అనుమానిస్తుండగా.. ఇది ఇతర వస్తువులతో ఢీకొట్టలేదని చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఇది చాలావరకూ వాతావరణంలోనే కాలిపోతుందని.. భూమిపై పడే ఛాన్స్ చాలా తక్కువని చెబుతున్నారు.

ఇదే సమయంలో... దీనిపై స్పందించిన స్పేస్ ఎక్స్... ఈ శాటిలైట్ ఫెయిల్యూర్ సమస్యను తీవ్రంగా తీసుకుంటున్నామని.. ఒత్తిడి పెరగడం.. లేదా, ప్రొపల్షన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెబుతోంది. ఈ సమయంలో సదరు శాటిలైట్ నుంచి కొన్ని శకలాలు విడుదలయ్యాయని.. ఇవి ప్రస్తుతం నెమ్మదిగా కదులుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే.. ఇది భూమిపై పడే అవకాశాలు చాలా వరకూ లేవని.. ఇది భూ వాతావరణంలోకి రాగానే కాలిపోవచ్చని తెలిపింది.

అసలేం జరిగింది..?:

ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ ఎక్స్ 2015లో స్టార్ లింక్ ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా హైస్పీడ్ ఇంటర్నెట్ ను అందించడం.. ప్రధానంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ ను అందించడం దీని ప్రధాన లక్ష్యం. దీనికోసం భారీ సంఖ్యలో శాటిలైట్స్ ని అంతరిక్షంలోకి పంపుతుంది స్పెస్ ఎక్స్. ఈ క్రమంలో తొలిదశలో సుమారు 12 వేల శాటిలైట్స్ ని పంపాలని సంస్థ ప్లాన్ చేసుకుంది. ప్రస్తుతం 9,357 కక్ష్యలో ఉన్నాయి.

అంతకు ముందు ఎక్స్ వేదికగా స్పందించిన స్పేస్ ఎక్స్... హఠాత్తుగా ఉపగ్రహంలో సాకేతిక లోపం తలెత్తి.. ప్రొపెల్షన్ ట్యాంక్ లో గ్యాస్ అత్యంత శకివంతంగా బయటకు వెలువడిందని.. దీంతో, ఒక్కసారిగా అది నాలుగు కిలోమీటర్లు కిందకు దూసుకు వచ్చిందని.. ఆ తర్వాత కొన్ని భాగాలు విడిపోయి మెల్లగా కదలడం మొదలుపెట్టాయని.. వారం రోజుల్లోగా భూవాతావరణంలోకి వచ్చి కూలిపోవచ్చని తెలిపింది.

Tags:    

Similar News