నోట్‌దిస్ పాయింట్.. లోకేష్ అన్నది కరెక్టేనా..?
వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొన్ని సూచనలు చేశారు. అదేసమయంలో కొన్ని సుద్దులు కూడా చెప్పారు. అదేంటంటే.. జగన్ త్వరలోనే `ఇంటి డాక్టర్` కాన్సెప్ట్ ను అమలు చేయాలని నిర్ణయించారు., దీనికిగాను ఆగస్టు 15ను ఆయన ముహూర్తంగా పెట్టుకున్నారు. అంటే.. డాక్టర్లు ఇంటింటికీ తిరుగుతూ.. ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని రికార్డు చేయనున్నా రు. దీంతో ఆ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే.. వారి రికార్డులు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉంటాయి.
దీంతో నాణ్యమైన వైద్యం వారికి అందించేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. దీనిని లోకేష్ తప్పుపట్టలేదు. కానీ.. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అదుపు చేయకుండా.. ప్రస్తుతం రోగులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా.. ఇలా చేయడం వల్ల.. ఏంటి ప్రయోజనం అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి గారు మీరు పంపే ఫ్యామిలీ డాక్టర్ వచ్చేలోగా జనాలు బతికేలా లేరు. సాక్షి రాతల మాయా ప్రపంచం నుంచి బయటికొచ్చి వాస్తవం చూస్తే తేంపల్లిలో మరణ మృదంగం కనిపిస్తుంది.. అని లోకేష్‌వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. కృష్ణా జిల్లాలో విషజ్వరాలతో వారం రోజుల్లో ఆరుగురు మృతి చెంచిన విషయాన్ని ప్రస్తావిం చారు. వాంతులు, విరేచనాలతో 70 మంది తీవ్ర అస్వస్థతకి గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. మాటల ముఖ్యమంత్రి, ప్రకటనల ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? బటన్ నొక్కి డయే రియా, విషజ్వరాలు తగ్గించేస్తారా? అంటూ లోకేశ్ మండిపడ్డారు. అయితే.. వాస్తవానికి జగన్ కాన్సెప్ట్‌ను కొట్టిపారేయడానికి ఏమీ లేదు. ఇది చాలా కీలకమైన విషయమే.
అయితే.. వైసీపీ దీనిని పట్టుకుని ప్రజల్లోకి వెళ్తే.. ఎక్కడ పేరు వస్తుందో అనే ఆవేదన.. సహజంగానే ప్రత్యర్థి పార్టీగా టీడీపీకి ఉంటుంది. ఈ నేపథ్యంలో నే తాజా పరిస్థితిని ఉటంకిస్తూ.. లోకేష్ ఇలా వ్యాఖ్యానించి ఉంటారని అంటున్నారు. అయితే.. ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే.. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకలు కొరికి చిన్నారులు మరణించిన ఘటనలు ఉన్నాయి. అదేసమయంలో గర్భిణులు కూడా రోడ్ల మీదే ప్రసవాలు చేసుకున్న పరిస్థితి ఉంది. వాటిని మరిచిపోవడమే..ఇప్పుడు లోకేష్ విషయంలో చర్చగా మారింది.