నర్సీపట్నం పులిని చూసి.. పులివెందుల పిల్లి భయపడింది: లోకేశ్

Update: 2022-06-19 06:31 GMT
మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జన జాతర, ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకత చూసి పిరికిపంద చర్యలు మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయన్నపాత్రుడిపై వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడిందని లోకేశ్ ఎద్దేవా చేశారు. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగన్ గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుందని విమర్శించారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జన జాతర, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చూసి పిరికిపంద చర్యలు మొదలెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయన్నపాత్రుడిపై వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుందన్నారు. ఆదివారాన్ని విధ్వంస దినంగా జగన్ ప్రభుత్వం మార్చిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షు లు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న అయ్యన్నపాత్రుడిపై జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక విధ్వంసాలు, విద్వేషాలు, కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాన్ని అస్త వ్యస్థంగా చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ గూండారాజుగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపో తారని దుయ్యబట్టారు. జగన్ పాలనలో ఆగడాలు, అకృత్యాలు కోకొల్లలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు ల అతిప్రవర్తనకు హద్దు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు.

తన ఇంటి పునాదులు కదులుతుండడంతో జగన్ టీడీపీ నేతల ఇళ్లని కూలుస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ మండిపడ్డారు. జగన్ పాలనే ప్రజావేదిక కూల్చివేతలతో మొదలైందని గుర్తుచేశారు. ఇవాళ జగన్ది కావొచ్చు.. కానీ, రేపు తమదని హెచ్చరించారు. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి జగన్ ఓర్వలేక నేతల ఇంటి గోడలను కూలుస్తున్నారని ధ్వజమెత్తారు. 70 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు పెట్టారని.. ఇది అధికార దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. 
Tags:    

Similar News