సీఎం జ‌గ‌న్ దావోస్ ప‌ర్య‌ట‌న‌.. నారా లోకేష్ కామెంట్ ఇదే!

Update: 2022-05-20 17:30 GMT
వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సులో పాల్గొనేందుకు ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న భార్య భార‌తితో క‌లిసి ప్ర‌త్యేక విమానంలో దావోస్‌కువెళ్ల‌డంపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆస‌క్తిగా స్పందించారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దావోస్‌కు ఎందుకు డబ్బులు దండగ అన్న జగన్‌.. నేడు ప్రత్యేక విమానంలో దావోస్ పర్యటనకు వెళ్లారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును విమర్శించేవారు చివరకు ఆయన మార్గంలో నడవాల్సిందేనని చెప్పారు.

చంద్రబాబును విమర్శించేవారు చివరకు ఆయన మార్గంలో నడవాల్సిందేనని లోకేష్ వ్యాఖ్యానించారు.  సంక్షేమం నుంచి ఐటీ వరకు పెట్టుబడులు ఆకర్షించటంలో చంద్రన్న మార్గమే రాజమార్గమని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దావోస్‌కు ఎందుకు డబ్బులు దండగ అన్న జగన్‌.. నేడు ప్రత్యేక విమానంలో దావోస్ పర్యటనకు వెళ్లారని అన్నారు. జగన్ ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఫోటోను లోకేశ్ ట్వీటర్ ఖాతాలో జత చేశారు.

ఇదిలావుంటే, స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరిగే.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్ బయల్దేరి వెళ్లారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దావోస్ పయనమయ్యారు. సీఎం జగన్ తోపాటు ఆయన సతీమణి భారతి, కుమార్తె వైఎస్.వర్షారెడ్డి, ఓఎస్డీలు పి.కృష్ణ మోహన్ రెడ్డి, ఏ.జోషి ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 31న తిరిగి రాష్ట్రానికి రానున్నారు.

కరోనా మహమ్మారి ప్రభావంతో రెండేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సంఘం సదస్సు.. ఈ నెల 22 నుంచి 26వరకూ జరగనుంది. రాష్ట్రం నుంచి సీఎం జగన్‌ తోపాటు, మంత్రులు, అధికారులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన అడుగులపై దావోస్‌ వేదికగా సీఎం కీలక చర్చలు జరపనున్నారు. పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సదస్సు ద్వారా ప్రస్తావించనున్నారు.

 కొవిడ్‌ నియంత్రణలో రాష్ట్రం అనుసరించిన ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌ అంశాల్నివివరించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాల్ని వివరించేందుకు దావోస్‌లో ప్రత్యేకంగా ఏపీ పెవిలియన్‌ ఏర్పాటుచేశారు. ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన మార్పులు, నవరత్నాల అమలు, అధికార వికేంద్రీకరణ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో వచ్చిన మార్పుల్ని తెలియజేయనున్నారు. సంప్రదాయ ఇంధన వనరుల రంగం, పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి అంశాలపైనా ఈ సదస్సులో దృష్టిసారించనున్నారు. కాలుష్యంలేని పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా చేపట్టిన కార్యక్రమాల్ని సీఎం జగన్‌ వివరించనున్నారు.
Tags:    

Similar News