జగన్ పై లోకేష్ అదిరిపోయే సెటైర్... కేటీఆర్ మాట... డీజే టిల్లు డైలాగ్
ఇటీవల విడులైన డీజే టిల్లు సినిమా యువతను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ` అట్లుంటది మనతోని` అంటూ హీరో చెప్పిన డైలాగ్ పాపులర్ అయింది. ఇప్పుడు అదే డైలాగ్‌ను టీడీపీ యువనేత నారా లోకేష్ ఉపయోగించారు. అందుఓలనూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు.
దీనికి వాడుకుంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి అయిన కేటీఆర్ చేసిన కామెంట్లను. ఏపీలో అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయాయి.. అన్యాయంగా.. అధ్వానంగా పరిస్థితి ఉందని చెప్తూ తెలంగాణకు తిరిగొచ్చిన తర్వాతే ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉందన్న సందర్భాన్ని ఉటంకించిన లోకేష్ అట్లుంటది జగన్ పాలనతో అంటూ సెటైర్ వేశారు.
హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. హైదరాబాద్‌లో జరుగుతోన్న అభివృద్ధి, అవకాశాలు.. ఇతర అంశాలపై మాట్లాడుతూ.. ఏపీని ఉద్దేశించి చేసి వ్యాఖ్యల వీడియోను ట్వీట్ చేసిన నారా లోకేష్ `కేటీఆర్ నోట… జగన్ విధ్వంస పాలన మాట… అట్టుంటది ఒక్క చాన్స్‌తోని..' అంటూ సెటైర్ వేశారు. దీంతో లోకేష్ ట్వీట్‌ను టీడీపీ శ్రేణులు వైరల్ చేశాయి.
మరోవైపు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సైతం కేటీఆర్ కామెంట్లపై స్పందించారు. ఏపీలో ఉన్న వాస్తవ పరిస్థితులు కేటీఆర్ చెప్పారన్నారు. ఒకప్పుడు ఏపీలో ఉన్న భూముల ధరలు 200 శాతం పడిపోతే, తెలంగాణలో గణనీయంగా పెరిగాయని, క్షీణించిన శాంతి భద్రతలు, జరగని అభివృద్ధి, పరిశ్రమలు మూతపడటంతో తెలంగాణ సురక్షితమని అంతా భావిస్తున్నారని తెలిపారు.
ఒక్క తెలంగాణ మాత్రమే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ గొప్ప చాటేందుకు ఏపీతోనే పోల్చుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. దీనికంతటికీ వైఎస్ జగన్ అసమర్థతే కారణం అని ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. ఏపీ విధ్వంసం, తెలంగాణ అభివృద్ధి వైఎస్ జగన్ -కేసీఆర్‌ల ఉమ్మడి అజెండాగా ఆయన ఆరోపించారు.