జగన్ కు నారా వారి సవాల్ చూశారా?
*సేవ్ విశాఖ* పేరిట నిన్న ఏపీలోని ప్రతిపక్షం వైసీపీ నిర్వహించిన ధర్నాలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన తీరు... టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి - ఏపీ కేబినెట్ లో కీలక శాఖల మంత్రి నారా లోకేశ్ కు బాగానే కోపం తెప్పించినట్టుంది. ఎందుకంటే... భూ దందాలపై ప్రభుత్వ వైఖరి - ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి మరీ దందాలు చేయిస్తున్నారంటూ జగన్ ఆవేశంగా మాట్లాడిన తీరు టీడీపీలో గుబులు రేపిందనే చెప్పాలి. విశాఖలో వెలుగు చూసిన భూ కుంభకోణాల్లో నారా లోకేశ్ కు ప్రత్యక్ష పాత్ర ఉందని, మరికొందరు టీడీపీ నేతలకు కూడా ఈ దందాల్లో ప్రమేయముందని జగన్ ఆరోపించారు.
ఈ కార్యక్రమాన్ని ముగించుకుని జగన్ విశాఖ నుంచి బయలుదేరగానే ఆయన చేసిన ఆరోపణలపై నారా లోకేశ్ వేగంగా స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించిన లోకేశ్... జగన్ కు గట్టి సవాల్ నే విసిరారు. మూడు వరుస ట్వీట్లలో జగన్ కు సవాల్ విసురుతూనే ఆయనపై విమర్శలు కూడా కురిపించారు. ఇక ఈ తరహా సవాళ్లు ఇప్పటిదాకా రెండు పర్యాయాలు విసిరానని, ఇది మూడో సవాల్ అంటూ లోకేశ్ పేర్కొన్నారు.
అయినా జగన్ కు లోకేశ్ సంధించిన తాజా సవాల్‌లోని వివరాల్లోకెళితే... భూదందాల్లో తన ప్రమేయముందని జగన్ ఆరోపించారని లోకేశ్ ఆక్షేపించారు. ఆ ఆరోపణలను జగన్ నిరూపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా... తన తాజా సవాల్ కు జగన్ 24 గంటల్లోగా స్పందించాలని కూడా లోకేశ్ డిమాండ్ చేశారు. పనిలో పనిగా భూదందాలపై బహిరంగ చర్చకు సిద్ధంగానే ఉన్నానని, మీరు సిద్ధమా అంటూ జగన్‌ను ప్రశ్నించారు.
తెలుగు అక్షరాల్లోనే లోకేశ్ చేసిన ట్వీట్లు ఇలా ఉన్నాయి. *జగన్ కు 24 గంటల టైమిచ్చి మరీ సవాల్ చేస్తున్నా. దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలను నిరూపించాలి. మీకిలా సవాల్ విసరడం మూడోసారి. ఆధారాలు చూపించమంటే పారిపోతారెందుకు? మళ్ళీ అడుగుతున్నా, బహిరంగ చర్చకు సిద్ధమా? ముఖ్యమంత్రి కొడుకైనంత మాత్రాన అందరూ నీలా ప్రజల సొమ్ము.....దోచుకుంటారా? నీ పచ్చ కామెర్ల కంటితో చూసి ఆరోపణలు చేయకు. మాది కీర్తి సంపాదన. నీది అవినీతి సంపాదన
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/