• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైసీపీపై వ్య‌తిరేక...

వైసీపీపై వ్య‌తిరేక పెరిగింది.. చంద్ర‌బాబు కామెంట్స్‌

By - Tupaki Desk
Update: 2022-02-22 03:30 GMT
వైసీపీ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడిన చంద్రబాబు.. ప్రజలకు న్యాయం చేసేందుకు గట్టిగా పోరాడాలని దిశానిర్దేశం చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. జగన్ రెడ్డి అసమర్థ , స్వార్ధపూరిత విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు, అవినీతిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నందున జగన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క ఛాన్సే చివరి అవకాశంగా చేసుకున్నారని  చంద్రబాబు విమర్శించారు. 175 నియోజకవర్గ ఇంఛార్జ్లు, 25 పార్లమెంట్ స్థానాల ఇంఛార్జ్లతో ఆన్లైన్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. పనిచేయని నేతలను ఉపేక్షించనని హెచ్చరించారు.

వైసీపీ పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాలూ నష్టపోయాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో నలిగిపోతున్న ప్రజలకు న్యాయం కోసం పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్తకూ నాయకులు అండగా నిలవాలని సూచించారు. తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేని సీఎం.. రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని నిలదీశారు.

జగన్ రెడ్డి అసమర్థ , స్వార్ధపూరిత విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ నేత‌ల‌ రౌడీయిజం, సెటిల్ మెంట్లపై గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి దగ్గర డబ్బు, అధికారం ఉంటే... టీడీపీకి ప్రజాబలం ఉందని ధీమా వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు నిర్ణయాలతో భక్తుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు.

త్వరలోనే ఆన్ లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. టీడీపీ40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు, ఎన్టీఆర్ 100వ జయంతి, మహానాడుకు ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించారు. మ‌హానాడును ఈ సారి.. అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించేందుకు ఏర్పాటు చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.
Tags:    
  • Nara Chandrababu Naidu 
  • TDP 
  • Andhrapradesh 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

Copyright @2026

Powered by Blink CMS