అక్రమ సంబంధం పెట్టుకున్నారని అందరి ముందు నగ్న స్నానం ..ఎక్కడంటే !

Update: 2020-09-04 00:30 GMT
రాజస్థాన్ లో గత నెలలో జరిగిన ఏ హేయమైన చర్య కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధం పెట్టుకున్నారని    ఓ యువ జంటకు ఖాప్ పంచాయితీ దారుణమైన శిక్షను వేసింది. గ్రామస్తులందరి ముందు ఆ ఇద్దరిని బలవంతంగా ఒంటి పై నూలుపోగు లేకుండా చేసి , అందరి ముందు స్నానం చేయించింది. అలా చేస్తే వారు చేసిన పాపం తొలగిపోతుందని పెద్దలు చెప్తున్నారు.  అలాగే రూ.53వేలు జరిమానా కూడా విధించింది. ఈ దారుణమైన ఘటన ..  అగస్టు 21న జరగగా , కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది... ఈ సంఘటన గురించి పూర్తిగా చూస్తే ..

రాజస్తాన్‌, సికార్ జిల్లాలో ఉన్న సోలా గ్రామంలో ఈ హేయమైన ఘటన చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన మేనల్లుడు,అత్త వరుసయ్యే ఓ యువతీకి సంబంధించి కొద్ది వారాల క్రితం ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ ఇద్దరూ ఏకాంతంగా కలిసి ఉన్న సమయంలో ఎవరో వారికీ తెలియకుండా ఆ  వీడియో తీసి దాన్ని లీక్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ విషయం గ్రామంలో పాంచ్ పటేల్స్‌ గా పిలవబడే సాన్సి తెగకు చెందిన పెద్ద మనుషుల దృష్టికి వెళ్లడంతో ఖాప్ పంచాయితీ ఏర్పాటు చేసి అగస్టు 21న ఆ ఇద్దరిని అక్కడికి పిలిపించారు. అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు .. గ్రామ ప్రజలు చూస్తుండగానే బలవంతంగా ఆ ఇద్దరిని వివస్త్రులను చేశారు. అలాగే అందరూ చూస్తుండగానే నగ్న స్నానం చేయాలనీ ఆదేశించారు. పెద్ద మనుషుల నిర్ణయాన్ని ఎదిరించే సాహసం చేయలేక ఆ ఇద్దరు వారు చెప్పింది చేశారు. ఆపై ఆ యువకుడి కుటుంబానికి రూ.31వేలు,ఆ యువతి కుటుంబానికి రూ.22వేలు జరిమానా విధించారు. ఆ డబ్బును పంచాయితీ పెద్దలే పంచుకున్నారు.

ఈ  ఘటన  పై సాన్సి డెవలప్ ‌మెంట్ కౌన్సిల్  సెప్టెంబర్ 1 సికర్ జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై అడిషనల్ ఎస్పీ దేవేంద్ర శర్మ మాట్లాడుతూ... ' ఆ ఇద్దరి కుటుంబాల అంగీకారంతోనే వారిద్దరినీ అందరిముందు స్నానం చేయించారు. బాధితురాలితో పాటు ఆమె అత్తింటివారితో మాట్లాడాం. దీనిపై విచారణకు లక్ష్మణ్‌ ఘర్‌ కి చెందిన ఎస్సీ ఎస్టీ సెల్ సీవోని పంపించాం అని తెలిపారు. ఆ తెగ లో   ఇలాంటి సాంఘీక దురాచారాలు చాలాకాలంగా కొనసాగుతున్నాయి. వారిద్దరిని అందరి ముందు స్నానం చేయించేందుకు ఒకవేళ ఆ రెండు కుటుంబాలు ఒప్పుకోకపోతే వారిపై సామాజిక బహిష్కరణ విధిస్తారు. అప్పటినుంచి ఇక ఆ కులంలో జరిగే ఈ ఏ కార్యక్రమాలకు వారికి ఆహ్వానం ఉండదు. ఒకవేళ ఎవరైనా సాహసించి పిలిస్తే వారికీ బహిష్కరణ తప్పదు. ఆధునికంగా ప్రపంచం ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఇంకా అలాంటి ఘటనలు జరుగుతుండటం విచారకరం.
Tags:    

Similar News