నగ్మాకు ఓ రేంజ్ పదవిచ్చేశారు

Update: 2015-10-07 05:43 GMT
టాలీవుడ్.. బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ తన అందచందాలతో నాటి కుర్రకారు మనసుల్ని దోచుకున్న తార నగ్మా. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీ నేతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమెకు పార్టీలో కీలకపదవినిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నగ్మాను ఎంపిక చేశారు. పార్టీ పరంగా ఆమె చేసిన సేవల సంగతేమో కానీ.. ఆమెకు ఏకంగా మహిళా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇవ్వటం విశేషం. కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్న శోభా ఓఝూను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంపిక చేసిన పార్టీ నగ్మాను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చేసింది.

నూతన కార్యవర్గానికి సంబంధించిన టీమ్ ను ఓకే చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారు.  సినిమాల్లో తన నటనతో అలరించిన నగ్మా.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పదవితో.. మరి ఏ రేంజ్ లో చెలరేగిపోతారో చూడాలి.
Tags:    

Similar News