• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కాంగ్రెస్ గ్యారంటీలపై...

కాంగ్రెస్ గ్యారంటీలపై 'ట్రంప్' కన్ను !

| ‘కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దేశంలోని మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో మాత్రమే కాదు.

By - Garuda Media
Update: 2026-09-16 03:50 GMT

‘కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దేశంలోని మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో మాత్రమే కాదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కాపీ కొడుతున్నాడని’ కర్ణాటక ముఖ్యమంత్రి డీకె శివకుమార్ అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు ఇతర రాష్ట్రాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. మా ఆలోచనలు భారత్ లోనే కాకుండా ప్రపంచం అంతా తెలుస్తున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ బలం అని అన్నారు.

2026 మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ రెండింటిలో గెలిస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి అమెరికన్ పౌరుడికి 5 వేల డాలర్లు ట్రంప్ డివిడెండ్ ఇస్తానని ఇటీవల టెక్సాస్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డల్లాస్‌లో రిపబ్లికన్ మిడ్‌టర్మ్ కన్వెన్షన్‌లో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తమ పథకాలను అమెరికా కూడా కాపీ కొడుతుందని కర్ణాటక సీఎం డీకె శివకుమార్ ప్రకటించడం గమనార్హం.

గత ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చింది. సిద్దరామయ్య మూడేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనంతరం ఇటీవల ఆయనను మార్చి ఆయన స్థానంలో డీకే శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించింది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో గృహాలక్ష్మి పథకం కింద 1.24 కోట్ల మంది మహిళలకు రూ.2 వేల చొప్పున నెలకు రూ.2,400 కోట్లు వారి ఖాతాలలో జమచేస్తుంది.

గృహాజ్యోతి పథకం కింద 1.64 కోట్ల ఇండ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నది. అన్నభాగ్య పథకం కింద 5 కిలోల బియ్యం, శక్తి పథకం కింద మహిళలకు ప్రభుత్వ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నది. దీంతో పాటు నిరుద్యోగులలో గ్రాడ్యుయేట్లకు రూ.3 వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.1500 యువనిధి పథకం కింద రెండేళ్ల పాటు సాయం అందిస్తుంది. ఈ పథకాలనే సీఎం శివకుమార్ ట్రంప్ ప్రతిపాదనతో పోల్చి కాపీ కొడుతున్నట్లు చెబుతున్నారు.

అయితే పథకాల అమలు వల్ల ప్రభుత్వం మీద ఆర్థిక వత్తిడి పెరిగిందని, ఇది అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతుందని విమర్శలు వస్తున్నాయి. రోడ్లు, ఇతర ప్రాజెక్టుల పనులు మందగించాయని, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం అవుతుందని అంటున్నారు. ఇది రాష్ట్రం దివాళా తీసే స్థితికి తీసుకువస్తుందని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఆరోపిస్తుంది. కానీ ప్రభుత్వ పథకాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేయూత ఇస్తున్నాయని కాంగ్రెస్ వాదిస్తున్నది.

Tags:    
  • dkshivakumar 
  • karnataka 
  • trump 
  • congress 
  • welfareschemes 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS