షాకింగ్: నాగంకు పుత్రశోకం!
నాగం ఇంట ఊహించని విషాదం చోటు చేసుకుంది. టీడీపీ నేతగా సుపరిచితుడు.. తర్వాతికాలంలో బీజేపీకి వెళ్లి.. ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా వ్యవహరిస్తున్న ఆయనకు పెద్ద కష్టమే వచ్చింది. 70 ఏళ్ల వయసులో నాగంకు ఎవరికీ రాకూడని విషాదం ఎదురైంది.
ఆయన పెద్దకుమారుడు దినకర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ రోజు రాత్రి తొమ్మిది - పది మధ్యలో ఆయన ఫిలింనగర్ లోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. గడిచిన కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్నారు. దీంతో.. ఈ నెల 4న ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు.
గడిచిన కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దినకర్ రెడ్డి మరణించినట్లుగా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. ఊహించని పరిణామంతో నాగం కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగంకు ఎదురైన విషాదాన్ని రాజకీయ వర్గాలు సంతాపం తెలియజేస్తున్నారు.