రామాయణం పోటీలో విజేత ఎవరో తెలుసా?

Update: 2016-02-14 05:05 GMT
రామాయణం మీద ఒక పోటీ పెడితే.. విజేతగా ఎవరు నిలిచే అవకాశం ఉంటుంది? అన్న ప్రశ్న వేస్తే విచిత్రంగా చూస్తే.. కచ్ఛితంగా హిందువే అని చెబుతారు. ఒకవేళ మీద సమాధానం కూడా అదే అయితే.. తాజా ఉదంతంలో మీరు తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అలాంటి అభిప్రాయం ఉన్న ఎంతోమందికి షాకివ్వటం కర్ణాటకకు చెందిన ఫాతిమా రాహిలాకు అలవాటు.

తొమ్మిదో తరగతి చదువుతున్న ఈ ముస్లిం బాలికకు రామాయణం కొట్టిన పిండి. రామాయణం మీద నిర్వహించిన పరీక్షలో టాపర్ గా నిలిచి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కర్ణాటకలోని పుత్తూరు (దక్షిణ కన్నడ జిల్లా)కు చెందిన రాహిలా అక్కడి స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది.  ఇటీవల నిర్వమించిన రామాయణ పరీక్షలో టాపర్ గా నిలిచింది. మొత్తం 35మంది రాసిన ఈ పరీక్షలో 93 మార్కులతో టాపర్ గా నిలవటం గమనార్హం. సో.. కొన్ని కొంతమందే చేస్తారన్న భావనను చెరిపేయండి.
Tags:    

Similar News