'ఇండిగో' ఉదంతం : కేటీఆర్ మాటలు ఆలోచింపచేస్తున్నాయి..
అలాగే అత్యంత పేదరికం ఉంది. ప్రపంచమే కుగ్రామం అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస్తే కుదరదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.;
అధికారం అంతా ఒకరిద్దరి చేతుల్లో ఉంటే దేశంలో ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా లోతుగా ‘ఇండిగో ’ వివాదంపై విశ్లేషించారు. హైదరాబాద్ లోని ట్రేడ్ యూనియన్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారియి. దేశంలోని విమానాశ్రయాల్లో పరిస్థితులకు ఇదే కారణమని పేర్కొన్నారు. పైలెట్లను దోపిడీ చేయవద్దని కేంద్రం గత ఏడాది చెప్పిందని.. విమానయాన సంస్థలు ప్రత్యామ్మాయ ఏర్పాట్లు ఇప్పటికీ చేయకుండా పైలెట్లను , సిబ్బందిని ఎక్కువ పనిదినాలు ఇచ్చి హింసించాయని అందుకే ఇప్పుడు ఇండిగో కార్యకలాపాల్లో సమస్యలు ఏర్పడ్డాయని అన్నారు.
కేంద్రం ఆదేశాలను కూడా ఇండిగో పాటించకుండా మొండికేసిందని.. దీంతో కేంద్రమే తన ఆదేశాలను ఉపసంహరించుకునే దుస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. పైలట్ల పనివిధానాలపై ఏడాది క్రితమే డీజీసీఏ షరతులు విధించిందని అన్నారు. దేశంలో విమానాలన్నీ టాటా, ఇండిగో చేతుల్లోనే ఉన్నాయి. ఐదురోజుల తర్వాత కేంద్రమే వెనక్కి తగ్గింది. తాను ఇచ్చి ఆదేశాలను తానే వెనక్కి తీసుకొని పైలెట్ల పని ఒత్తిడిని పక్కనపెట్టింది. ఈ నిర్ణయం కారణంగా సంపద మొత్తం కొందరి చేతుల్లోనే ఉంటే ఇలాంటి పరిస్థితులే దేశంలో ఏర్పడుతాయని కేటీఆర్ విశ్లేషించారు. ఇండిగో వ్యవహారంతో ఎయిర్ పోర్టులు బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లుగా మారాయని.. కొత్త లేబర్ కోడ్ లు అమల్లోకి వస్తే ఇండిగోతో జరిగిన అసౌకర్యం మిగతా రంగాలకు విస్తరిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
ఎప్పుడు కాని దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి. అది కూడా నాణ్యతతో ఉండాలని కేటీఆర్ సూచించారు. కొత్త లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ కార్మిక విధానాలపై మాట్లాడారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల కన్నా ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ లో అర్థవంతమైన చర్చ జరిగింది. ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యంత కుబేరులు ఉన్నారు.
అలాగే అత్యంత పేదరికం ఉంది. ప్రపంచమే కుగ్రామం అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస్తే కుదరదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలలో భాగంగా కొత్త సంస్కరణలు తీసుకువస్తే భారతదేశంలో కష్టమని మాజీ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ దేశంలో 92 శాతం మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కేసీఆర్ పేదవారి సంక్షేమాన్ని ఎన్నడూ విస్మరించకుండా మానవీయ కోణంలో ఆలోచించారు. ప్రతిపక్షంలో ఉండగా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ చలించిపోయి పార్టీ తీరుఫున ఆర్థిక సాయం చేశారని.. కనీసం పాలకుల్లో చలనం వస్తుందని కేసీఆర్ ఆనాడు పార్టీ తరుఫున సాయం చేశారని కేటీఆర్ గుర్తు చేశారు.