సీఈవోపైవేటు..? ఇండిగో సంక్షోభంపై కఠిన చర్యలు దిశగా కేంద్రం?

ఈ అంతరాయాలపై కేంద్రం ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.;

Update: 2025-12-06 14:58 GMT

దేశీయ విమానయాన రంగంలో ఇండిగో సంక్షోభం.. దీని వల్ల దేశవ్యాప్తంగా ఈ రంగంపై విమర్శలు.. కేంద్రాన్ని టార్గెట్ చేస్తుండడంతో ఎట్టకేలకు బీజేపీ ప్రభుత్వం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇండిగో పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితిని కేంద్ర పౌర విమానయాశాఖ మంత్రి రామానాయుడు తొలిసారి స్పందించి సీరియస్ గా చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు.

ఇండిగో సీఈవోపై వేటు?

జాతీయ మీడియా కథనాలను బట్టి చూస్తే ఈ సంక్షోభానికి బాధ్యత వహిస్తూ సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ ను పదవి నుంచి తొలగించేలా ఇండిగో బోర్డుకు కేంద్రం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఎయిర్ లైన్ పై భారీగా జరిమానా విధించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సీనియర్ అధికారులు చెబుతున్నారు. పౌర విమానయాన శాఖ ఈరోజు రంగంలోకి దిగింది. ఈ సాయంత్రం ఇండిగో అధికారులను పిలిపించి సంక్షోభంపై వివరణ తీసుకోనున్నారు. దీంతోపాటు ఆ కంపెనీ విమాన సర్వీసులను తాత్కాలికంగా తగ్గించనున్నట్లు సమాచారం.

ఇండిగో ఉన్నత స్థాయి విచారణ

ఈ అంతరాయాలపై కేంద్రం ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దీని కోసం పౌర విమానయాన శాఖ మొత్తం నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. డీజీసీఏ జాయింట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్ స్పెక్టర్, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్ స్పెక్టర్ లను కమిటీ గా ఏర్పాటు చేశారు. ఇలాంటి అంతరాయాలు చోటుచేసుకోకుండా ఉండటానికి అవసరమైన సిఫార్సులు కూడా చేయనుంది.

ఇండిగో సమాధానం చెప్పాలి : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

ఇండిగోసంక్షోభంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. విమాన టికెట్ల ధరలు పెంచకూడదని ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు. ప్రత్యేక కమిటీ వేసి విచారణకు ఆదేశించాం. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ఇండిగో కచ్చితంగా సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించామని.. ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిందని కేంద్రమంత్రి తెలిపారు. రద్దు అయిన విమానాలకు సంబంధించి రేపు రాత్రి 8 గంటలలోపు రీఫండ్ చేయాలని ఇండిగోను ఆదేశించినట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

కేంద్రం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ఇండిగో సంస్థ కూడా తన సేవలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుందో లేదో చూడాలి. ఇక సీఈవో భవితవ్యం కూడా ఏంటన్నది వేచిచూడాలి.

Tags:    

Similar News