డీప్ ఫేక్ కు బిల్లుతో చెక్ పెడుతారా? సాధ్యమేనా?
డీప్ ఫేక్.. ఇటీవల కాలంలో సెలబ్రెటీలు, ప్రముఖులు దీని బారిన పడి ఏఐతో చేసిన నకిలీ వీడియోలు, ఫొటోలతో ఇబ్బందులు పడుతున్నారు.;
డీప్ ఫేక్.. ఇటీవల కాలంలో సెలబ్రెటీలు, ప్రముఖులు దీని బారిన పడి ఏఐతో చేసిన నకిలీ వీడియోలు, ఫొటోలతో ఇబ్బందులు పడుతున్నారు. చిరంజీవి, నాగార్జున లాంటి వారు కూడా డీప్ ఫేక్ బారిన పడి పోలీస్ స్టేషన్ గడప తొక్కారు. డీప్ ఫేక్ అంతూ పొంతూ లేకుండా హీరోలు, హీరోయిన్లు, ప్రముఖులు అష్టకష్టాలుపడుతున్నారు. చాలామంది ఎదుర్కొంటున్న డీప్ ఫేక్ కు చెక్ పెట్టాలని పార్లమెంట్ లో బిల్లుకు రంగం సిద్ధమైంది. డీప్ పేక్ నియంత్రణకు లీగల్ ఫ్రేమ్ వర్క్ ను రూపొందించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించారు.
డీప్ ఫేక్ బిల్లును శివసేన ఎంపీ శ్రీకాంత్ శిందే ప్రవేశపెట్టారు. ఇది ప్రైవేట్ బిల్లు. ఇలాంటి డీప్ ఫేక్ కంటెంట్ రూపొందించేందుకు వ్యక్తుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి చేయాలన్నారు. వేధింపులు, మోసం, తప్పుడు సమాచారం కోసం డీప్ ఫేక్ ను దుర్వినియోగం చేయడం పెరిగిపోయింది. దీని నియంత్రణకు సంబంధించి వెంటనే చర్యలు చేపట్టాలని శ్రీకాంత్ విందే పేర్కొన్నారు.
దురుద్దేశంతో ఇలాంటి కంటెంట్ ను సృష్టించినా లేదా ఫార్వర్డ్ చేసినా అలాంటి వారికి శిక్షలు పడేలా ఈ ప్రైవేటు బిల్లు ద్వారా చట్టం చేయడానికి లోక్ సభ రెడీ అయ్యింది. వ్యక్తిగత భద్రత, జాతీయ భద్రత గురించి ఈ బిల్లు అవసరమని గుర్తించారు.
ప్రస్తుతం ఏఐ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో డీప్ ఫేక్ టెక్నాలజీ సెలబ్రెటీలకు పెను ఘాతంగా మారింది. ఈ టెక్నాలజీ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ అందరినీ కలవరపెడుతోంది. ఈ డీప్ ఫేక్ ను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు తేలికగా మోసాలకు పాల్పడుతున్నారు.
ఇక ఇటీవల కాలంలో ప్రధాని మోడీతో బీహార్ యువ ఎమ్మెల్యేకు కలగలిపి కూడా డీప్ ఫేక్ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై ప్రధాని మోదీ కూడా గతంలో దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ వీడియోలు సమాజానికి పెనుముప్పుగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు.
అయితే సాధారణంగా ప్రభుత్వమే ఇలాంటి బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెడుతారు. కేంద్రమంత్రులు ప్రవేశపెట్టి మాట్లాడుతారు. కానీ తీవ్రమైన ఈ అంశంపై ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. కేంద్రం చొరవ చూపకపోవడంతో ఎంపీలు ప్రైవేటు బిల్లుకు మొగ్గు చూపారు. ఈ బిల్లు కోసం ఇప్పటికే ఒక స్పీకర్, చైర్మన్ కు నోటీసు ఇవ్వాలి.
పార్లమెంట్ చరిత్ర చూస్తే.. 1952 నుంచి 300కు పైగా ప్రైవేటు బిల్లులు సభ ముందుకు వచ్చాయి. అయితే 14 బిల్లులే చట్టాలుగా మారాయి. వాటిలో ముస్లిం వక్ఫ్ ఇండియన్ రిజిస్ట్రేషన్, హిందూ వివాహ సవరణ , ఐపీఎస్ బిల్లులు లాంటివి ఇంతకుముందు ఇలానే ప్రైవేటు బిల్లుగానే ప్రవేశపెట్టారు.