నేడు ప్రపంచ యోగా దినోత్సవం. ప్రపంచం మొత్తం... ప్రత్యేకించి భారత దేశమంతా యోగాసనాలతో జనం హోరెత్తిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో కేంద్రంగా యోగా దినోత్సవాన్ని ఘనంగా ప్రారంభించేశారు. యోగాసనాలతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్రమబద్ధమైన జీవన యానానికి యోగా సోపానమిస్తుంది. ఇంత మంచి యోగాను కాదనే వారు ఎవరున్నారు చెప్పండి. ఎవరూ కాదనరు గానీ... ముంబై పోలీసులు దీనికంటే ఇంకా ఏం చేయగలమని ఆలోచించారు.
అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగేసిన ఖాకీలు... యోగాతో ట్రాఫిక్ నియమాలను మిక్స్ చేసేద్దామని నిర్ణయించారు. అంతే అనుకున్నదే తడవుగా యోగాసానాలతో పాటు... ఆయా ఆసనాలకు సరిపడ ట్రాఫిక్ రూల్స్ ను మిళితం చేసి ప్రత్యేకంగా కార్టూన్లను రూపొందించారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేటి ఉదయం సదరు కార్టూన్లను వారు విడుదల చేశారు.
అంతటితో ఆగకుండా యోగా ప్లస్ ట్రాఫిక్ రూల్స్ ను కలగలిపి రూపొందించిన కార్టూన్లను ఒక్క ముంబై వాసులకే కాకుండా యావత్తు దేశ ప్రజలకు తెలియజేసేందుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్రాఫిక్ అనుశాసన్ పేరిట ప్రత్యేక హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో పెట్టేశారు. ట్రాఫిక్ నియమాలను ప్రజలకు అర్థవంతంగా చెప్పేందుకు వాటిని యోగాసనాలతో కలిపేసి ప్రచారం చేసేందుకు ముంబై పోలీసులు చేసిన ఈ యత్నానికి జనం నుంచి జేజేలు లభించాయి. నెటిజన్లు అయితే... ముంబై పోలీసుల వినూత్న ఆలోచనకు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/