రాళ్లు తెస్తే గుడి కట్టేసినట్లా?

Update: 2015-12-24 05:09 GMT
అయోద్యలో వివాదాస్పద భూమిలో రామాలయ నిర్మాణం జరుగుతోందని.. ఇందుకు అవసరమైన గ్రానైట్ రాళ్లను లారీల్లో తీసుకొస్తున్నారంటూ వస్తున్న వార్తల వ్యవహారం రాజ్యసభలో దుమారం లేచింది.దీనిపై విపక్ష సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2017లోయూపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఇలాంటివి చేస్తున్నారంటూ మండిపడ్డారు.

అయితే.. అయోధ్యలో జరుగుతున్న దానికి.. వస్తున్న ఆరోపణలకు సంబంధం లేదన్న వాదనను కేంద్ర సర్కారు వినిపించింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలానికి 1.5కిలోమీటర్ల దూరంలో మందిరం నిర్మాణం కోసం 1990 నుంచి రాళ్లను తొలుస్తున్నారని.. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సభకు వివరణ ఇచ్చారు. రాళ్లు తీసుకొచ్చినంత మాత్రాన గుడి కట్టేస్తారని అనుకోవద్దని వ్యాఖ్యానించారు. కోర్టు నిర్ణయానికే కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. రాళ్లు తెచ్చినంత మాత్రాన గుడి కట్టేసినట్లా? అంటూ నక్వీ చెప్పిన సమాధానికి విపక్ష నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. వెల్ లోకి దూసుకెళ్లటంతో సభలో గందరగోళం ఏర్పడింది.
Tags:    

Similar News