చైనా చిన్నబోతోంది...షాకింగ్ గా జననాల రేటు

ఏ దేశంలో అయినా మరణాలు జననాలు సమానంగా ఉంటే ఒక పద్ధతి, మరణాలు తగ్గి జనాభా అధికంగా ఉంటే అదొక సమస్య.;

Update: 2026-01-21 03:33 GMT

ఆ మధ్య దాకా ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన దేశం చైనా అని అంతా చెప్పుకున్నారు. చైనా బరువుగా కనిపించేంది. సంతాన లక్ష్మిగానూ అగుపించేది. భారత్ ఆ తరువాత స్థానంలో ఉండేది. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది. భారత్ లో జనాభా పెరుగుతోంది. ప్రపంచంలో జనాభాలో నంబర్ వన్ గా ఇండియా ఉంది. చైనా తీరు తిరోగమనంలో ఉంది. జననాల రేటు అయితే దారుణంగా తగ్గిపోతోంది. గిట్టే వారు తప్ప పుట్టే వారు కనిపించడం లేదు దాంతో చైనాలో ఇది అందోళకరమైన అంశంగా మారుతోంది.

కనిష్ట స్థాయిలోకి :

చైనాలో వరసగా చూస్తే నాలుగవ ఏడాది కూడా బర్త్ రేట్ తక్కువగానే ఉంది అని నివేదికలు చెబుతున్నాయి. ఎంతలా అంటే 1949 తరువాత అంతటి కనిష్ట స్థాయికి జననాల రేటు పడిపోయింది అని అంటున్నారు. ఇది పూర్తిగా ఇబ్బంది కలిగించేదిగా అంటున్నారు. వృద్ధులు అధికంగా ఉన్నారు, యువత తగ్గిపోతోంది, పనిచేసే వారు లేకుండా పోతున్నారు అన్న బెంగ చైనాకు పట్టుకుంది. ఇక జనాభా పెంచండి అని ఎంతలా ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా ఆశించిన ఫలితలౌ అయితే రావడం లేదు అని అంటున్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది కానీ రిజల్ట్ వెరీ బ్యాడ్ గా ఉంది అని అంటున్నారు.

మరణాలే ఎక్కువ :

ఏ దేశంలో అయినా మరణాలు జననాలు సమానంగా ఉంటే ఒక పద్ధతి, మరణాలు తగ్గి జనాభా అధికంగా ఉంటే అదొక సమస్య. మరణాలు పెరిగి జననాలు తగ్గితే అది ఇంకా పెద్ద సమస్య. ప్రస్తుతం చైనా ఇలాంటి సమస్యనే ఎదుర్కోంటోంది అని అంటున్నారు. ఇక చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎన్‌బీఎస్ గణాంకాల ప్రకారం చూస్తే కనుక 2025లో చైనాలో 79.2 లక్షల జననాలు నమోదు అయ్యాయి. అదే సమయంలో కా1.13 కోట్ల మరణాలు జరిగాయి. అంటే జననాల రేటు ప్రతి 1000 మందికి 5.63గా నమోదైందని అంటున్నారు. ఇది 2024లో నమోదైన 95.4 లక్షల జననాలతో పోలిస్తే 17 శాతం తక్కువగా ఉందని కూడా గుర్తు చేస్తున్నారు. ఇక మరణాల రేటు తీసుకుంటే ప్రతి 1000 మందికి 8.04కి పెరిగిందని ఇది ఏకంగా 1968 తర్వాత అత్యధికంగా ఉండడంతో ఆందోళన పెంచే అంశమని చైనా ఏలికలు కలవరపడుతున్నారు.

లక్షల్లో తగ్గిపోతూ :

ఏ ఏటికి ఆ ఏడు లక్షలలో జనాభా చైనాలో తగ్గిపోతోంది. 2024లో పోలిస్తే 2025లో జనాభా 33.9 లక్షలు తగ్గిందని అంటున్నారు. లేటెస్ట్ లెక్కలతో చైనా మొత్తం జనాభా 140.5 కోట్లకు చేరినట్లు అయింది. ఇక 1949 తర్వాత చైనాలో ఈ మాదిరిగా జననాల రేటు దారుణంగా పడిపోవడం ఇదే ఫస్ట్ టైం అని అంటున్నారు. పిల్లలను కనండి ఆర్థిక సాయం చేస్తామని చెబుతోంది ప్రభుత్వం, అలాగే జనాభాను పెంచండి పన్నులో రాయితీలు ఇస్తామని కూడా అంటోంది. ఇవే కాదు ఇతరత్రా అనేక రకాలైన హామీలు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు, అయినా కానీ జనాభా మాత్రం పెరగడం లేదు, చైనా పాలకులకు దీంతో ఏమి చేయాలో అర్ధం కాకుండా ఉందని అంటున్నారు.

ఓల్డేజ్ చైనా :

ఇపుడు చైనాను చూస్తే ఓల్డేజ్ కంట్రీ అనే అంటారుట. ఎందుకంటే అక్కడ ఓల్డేజ్ పీపుల్ ఎక్కువ అయ్యారు. మొత్తం జనాభాలో వారి శాతం ఏకంగా 23 కి చేరింది. అంటే 32.3 కోట్లుగా ఉన్నారు అన్న మాట. ఇక పనిచేసే ఏజ్ ఉన్న వారి శాతం చూస్తే 60.6 శాతానికి తగ్గింది. ఈ పని చేసే ఏజ్ గ్రూప్ ని 16 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉంచారు. అయితే చైనాలో జనాభా తగ్గుదల అన్నది ఆందోళకరమైన పరిణామం కాదని ఎన్‌బీఎస్ అధికారి వాంగ్ పింగ్‌పింగ్ అంటున్నారు. ఈ రోజుకి కూడా చైనా జనాభాయే పెద్దది అని ఆయన అంటున్నారు. జనాభా నాణ్యత కూడా బాగా మెరుగుపడుతోంది అని చెబుతున్నారు. అయితే తగ్గుతున్న జననాలు పెరుగుతున్న మరణాలు అలాగే అధికమవుతున్న వృద్ధ జనాభా ఇవన్నీ చైనాకు పెను ముప్పే అని నిపుణుల నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది.

Tags:    

Similar News